Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సమాజం

[ప్రభ గారు రచించిన ‘సమాజం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

మిటి ఈ సమాజం?
ఎక్కడ నుండి ఎక్కడికి
ఈ సమాజ సంస్కృతి నడుస్తున్నది..

ప్రేమను పంచే అమ్మే
పసి కన్నుల పీకలు కోస్తున్నదే!

కామాంధుల నుండి రక్షించే నాన్నే
కామాంధుడై కూర్చునాడే!!

నీతులు చెప్పే నీతి లేని టీచర్లే రేపటి తరాన్ని
తెలివిలేని తరంగా మారుస్తువారే!
పేపర్ కూడ అనుమతించని తరం నుండి
‘మైక్రో జిరాక్సులు’ అందించే తరానికి దిగజార్చారే!

మాతృదేవో భవ, పితృదేవో భవ,
గురుదేవో భవ అనే ధోరణిని మాపివేస్తున్నారే!

సంస్కృతికి నిలయమైన మన భారతదేశాన్ని
విలువలేని దేశంగా మారుస్తున్నారే!

ఏమిటి ఈ సమాజం!
ఎక్కడ నుండి ఎక్కడికి
ఈ సమాజ సంస్కృతి నడుస్తున్నదో!
ఆ దేవుడికే తెలియాలి.

Exit mobile version