[డా. షహనాజ్ బతుల్ రచించిన ‘సామాజిక రుగ్మతలు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]
అవినీతి రాజ్యమేలుతుంది.
న్యాయం చచ్చిపోయింది.
అర్హత ఉన్నవారికి ఉద్యోగాలు లేవు
ప్రతిభ ఉన్నవారికి ఉద్యోగాలు లేవు
ప్రతిభ ఉన్నవారికి పదవిలో అభివృద్ధి లేదు.
సిఫారసు తెచ్చిన వారికి ఉద్యోగము
లంచం ఇచ్చిన వారికి ఉద్యోగము
ప్రతిభ ఉన్నవారు ఉద్యోగం దొరక్క
ఆత్మహత్య చేసుకునేవారు ఉన్నారు.
మానవత్వం చచ్చిపోయింది.
ప్రమాదం జరిగితే కాపాడడానికి
ఎవ్వరూ రావడం లేదు
కానీ మొబైల్‌లో రికార్డ్ చేసుకుంటారు.
ఈ మధ్య సెల్ఫీల పిచ్చి పట్టింది
కొంతమందికి రీల్స్ పిచ్చి పట్టింది
వాళ్ళు ఏమీ ఆలోచించరు
ఎదుటి వ్యక్తి ఆపదలో ఉంటే
సహాయం చేయాలని ఆలోచించరు.
ఇరుగుపొరుగు ఒకప్పుడు
సహాయం చేసుకునేవారు.
ఇప్పుడు రుగ్మత వచ్చింది కదా
ఎవరికి వారే, యమునా తీరే
ప్రక్క ఇంట్లో ఏం జరుగుతుంది
ఎవరికీ తెలియదు.
ఎవరికైనా ఆర్థిక సహాయం
చేయడానికి రారు.
కానీ అన్నం తినే పదార్థాలు వృథా చేస్తారు
పేదవారికి ఇవ్వడానికి మనసు రాదు.
ఈ సామాజిక రుగ్మతలకు
చికిత్స దేవుడే ఇవ్వాలి.