Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సాక్షి

[మణి గారు రచించిన సాక్షి’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

నా ఊపిరి, నువ్వు పీల్చుకుంటావు!
నా కళ్ళళ్ళోంచి, నువ్వు చూస్తావు!
నా చెవులతో, నువ్వు వింటావు!
నేను తింటే, నువ్వు కడుపు నింపుకుంటావు!
నా గుండెలో, నువ్వు కొట్టుకుంటావు!
నా గొంతులో మాటలు, నీవా?
నా నొప్పికి, నీకు బాధ?
నా దుఃఖానికి, నీకు కన్నీళ్ళు?
నా సంతోషానికి,
నువ్వు నాట్యం?
నాలోనే వుంటూ, నాతోనే వుంటూ,
వెయ్యి కళ్ళతో అనుక్షణం
నన్ను కనిపెడుతూ,
నువ్వు..!
ఎవరు నువ్వు?
ప్రశ్నలు,
నువ్వా?.. నీవా?? నావా??..
సమాధానాలు నీవా?? నువ్వేనా??
నువ్వు, నేనా?
నేనేనా, నువ్వు?
నీ ఉనికి, నాలోనా?
ఈ అస్తిత్వం, నీదేనా?
నీకు, నాకు మధ్య
ఎంత సమయం? ఎంత దూరం?
ఎప్పుడు.. ఎక్కడ, అంతమవుతుంది?
నిన్నూ, నన్నూ ఎప్పుడు, ఎక్కడ
ఏకం చేస్తుంది?
అదేనా,
ఆద్యంతాలు లేని బిందువు!..
అక్కడ నుంచేనా, విశ్వం
విస్తరిస్తుంది!.
అక్కడ నుంచేనా నువ్వూ,..
నేనూ.. ఆవిర్భవించిందీ
నేను సాక్షినా!
నేనే సాక్షినా?!

Exit mobile version