Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీ 2025 – ప్రకటన-2

రాయపెద్ది వివేకానంద్ కుటుంబ సభ్యులు, సంచిక పత్రిక సంయుక్తంగా 2025 దీపావళి సందర్భంగా ‘రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీ’ నిర్వహిస్తున్నాము.

 

ఈ పోటీలో పాల్గొనవలసిందిగా కథకులకు ఆహ్వానం పలుకుతున్నాము.

మొత్తం బహుమతుల విలువ రూ. 15,000/-

మూడు విభాగలలో కథల పోటీలు..

1) పౌరాణిక కథలు 2) సైన్స్ ఫిక్షన్ కథలు 3) థ్రిల్లర్ (ఉత్కంఠ) కథలు

పోటీకి వచ్చిన కథలలో ఉత్తమమైన కథలను ఎంపిక చేసి బహుమతులు అందచేస్తాం.

కథల నిడివిపై పరిమితి లేదు. ఒక్కొక్కరు ఎన్ని కథలనైనా పంపవచ్చు. కథకులకు వయసు పరిమితి లేదు. ఏ వయసులో వారైనా ఈ పోటీలో పాల్గొనవచ్చు.

కథను టైప్ చేసి పంపితే సంతోషం. టైప్ చేయించి పంపేవారు పిడిఎఫ్‍తో పాటు ఓపెన్ ఫైల్ కూడా పంపాలి.

చేతి రాతతో పంపేవారు కథను చివరి తేదీ వరకూ ఆగకుండా కాస్త ముందుగానే పంపటం వాంఛనీయం!

నియమ నిబంధనలు:

పంపాల్సిన విధానం:

మెయిల్ ద్వారా కథలు పంపాల్సిన చిరునామా – mythologysciencefiction@gmail.com మెయిల్ సబ్జెక్ట్ లైనులో రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీకి అని వ్రాయాలి.

వాట్సప్ ద్వారా అయితే – 9849617392. రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీకి అని వ్రాయాలి. వాట్సప్‌లో కథలు పంపినవారు తమ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ తప్పక పేర్కొనాలి.

By Post (పోస్ట్ ద్వారా అయితే):

(గమనిక: పోస్ట్ ద్వారా పంపేవారు విధిగా కథ కాపీ తమ దగ్గర వుంచుకోవాలి).

Sachika Web Magazine

Plot no 32, H.No 8-48

Raghuram Nagar Colony.

Aditya Hospital lane

Dammaiguda, Hyderabad-500083

అనే చిరునామాకి పంపాలి. పోస్టల్ కవర్ మీద తప్పనిసరిగా రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీకి అని వ్రాయాలి.

ఫలితాలు 2025 దీపావళి నాడు వెలువడతాయి. అనంతరం సంచిక వెబ్ పత్రికలో బహుమతి పొందిన కథలు, సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథలూ వరుసగా ప్రచురితమవుతాయి.

Exit mobile version