Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రెంటి నడుమా నేను

[శ్రీ వారాల ఆనంద్ రచించిన ‘రెంటి నడుమా నేను’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

ర్షం
ఎందుకు కురిసిందో ఎందుకు ఆగిందో
మబ్బుని అడిగితే ఏంచెబుతుంది

కురిసిన వాన మట్టిలో
ఇంకిపోయిందో ఆవిరయ్యిందో
భూమిని ప్రశ్నిస్తే ఎట్లా చెబుతుంది

ప్రేమో ద్వేషమో
ఎందుకు పుట్టిందో
ఎట్లా సమసిపోయిందో
ఎవర్ని అడిగినా ఏమని చెబుతారు

కొన్ని ప్రశ్నలకు జవాబులుండవు
కొన్ని జవాబులకు ప్రశ్నలుండవు

బహుశ
ప్రశ్నలోనే జవాబు
జవాబులోనే ప్రశ్న
రెంటి నడుమా
నేనున్నానేమో

Exit mobile version