కన్నులు కలబడతున్నాయి
నీ వన్నెలు చూసి
పెదవులు తడిఒడుతున్నాయి
నీ సొగసును చూసి
చేతులు తడవడుతున్నాయి
నీ కురులును చూసి
మనసు మెలిబడుతుంది
నీ వలపు పవనాలు తాకి
మనసు కలవరపడుతుంది
నీ వంపుల సుగంధాలు చేరి
మనసు ప్రబంధమై చెలరేగుతుంది
నీ పైపరువపు అలలఉప్పెనకి
నీవు రస మాధురై
విరుపుల వయ్యారాల
బాణాలు వదులుతుంటే
నేను మదన తుమ్మెదై చేరనా…
నీ కొంటెపూల కోనలో
రస చందన తీగనై చేరనా
డా. బాలాజీ దీక్షితులు పి.వి. హోమియోపతి వైద్యునిగా, కవిగా, గెస్ట్ లెక్చరర్‌గా, వ్యక్తిత్వ వికాస నిపుణినిగా, కౌన్సిలింగ్ సైకాలజీస్ట్గా ఇలా ఎన్నో రంగాలలో విశిష్టత చాటుకున్నారు. డా. దీక్షితులు ఇప్పటి వరకు 58 జాతీయ,అంతర జాతీయ పరిశోధనా పత్రాలు ప్రచురించారు. ఇప్పటికి 10 పరిశోధనా సమావేశాలలో పాల్గొన్నారు, దాదాపు 90 తెలుగు రచనలు వివిధ పత్రికలలో ప్రచురితం అయినాయి. వీరి సేవ మరియు ప్రతిభను గుర్తించి యూనివర్సిటీ అఫ్ సోత్ అమెరికా డాక్టరేట్ 2016లో ఇచ్చింది. ఇవిగాక అనేక అవార్డ్స్, రివార్డ్స్ అనేక సంస్థలు అందించాయి.