నవంబర్ 13వ తేదీన విడుదలయ్యే రామకథసుధ కథల సంకలనంలో ప్రచురణకు ఎంపికయిన కథల జాబితా.. పుస్తకంలో ఇదే వరుసలో కథలు ప్రచురితమవుతాయి.
సంకలనంలో ప్రచురణకు ఎంపికయిన వారందరికీ ధన్యవాదాలు, అభినందనలు. ఇంకా, రాముడు, రామాయణానికి సంబంధించి అనేక అత్యద్భుతమయిన కథలున్నా, అన్నీ మా దృష్టికి రాకపోయి వుండవచ్చు. వచ్చినా మేము అనుకున్న ప్రామాణికాలలో వొదగకపోయి వుండవచ్చు. అంతే తప్ప, కథలలో లోపం వుందని అనుకోకూడదు. కేవలం మేము అనుకున్న ప్రామాణికాలలో వొదగక పోవటంవల్లనే ఎంచుకోలేదు తప్ప కథల్లో నాణ్యతా లోపంవల్ల కాదు!! మేము అనుకున్న ప్రామాణికాలు పుస్తకానికి ముందుమాటలో వివరించాము.
విషయసూచిక
రామాయణ ఆధారిత కథలు
సామాజిక రామాయణం
సంపాదకులు
కస్తూరి మురళీకృష్ణ, కోడీహళ్ళి మురళీమోహన్, కొల్లూరి సోమ శంకర్
రామకథాసుధ ఫలితాలు చూశాను. నేను వ్రాసిన రెండు కథలూ ఎంపిక కాలేదు. అయితే చిన్న పాటి బాధ కలిగింది. పోటీకి పంపబడిన రెండు కథలూ నేను వేరెవరికీ పరిశీలనకు కూడా పంపుకోలేని విధంగా నా చేతులు కట్టేశారు. మీ ప్రమాణాలు మీకు ఉండటంలో తప్పులేదు. అన్ని పత్రికలకూ కావలసినది అదే అయి ఉండదు కదా. అటువంటప్పుడు పరిశీలనకోసం అందిన కథలను ‘సంచిక’ లో ప్రచురించకుండా ఉండాల్సింది. నిబంధన మీరు ముందే తెలియచేసినా నా మనసుకు ఎందుకో కష్టం కలిగింది. ఏ రచయితా తన కథను మరుగున పడి ఉండటానికి వ్రాయడు కదా! ఈ సారి మీరు వేరొక పోటీ నిర్వహించినప్పుడు ఈ విషయాన్ని గమనించమని ప్రార్థన. రెండవ విషయం. రచన తిరస్కరింపబడినా ఆ విషయం రచయితకు తెలియచేస్తే బాగుంటుంది. సంకలనం విడుదల ఎప్పుడో తెలియనప్పుడు ఫలితాల గురించి ప్రతిరోజూ వెతుక్కోవలసి వస్తుంది. ఎన్నో చిన్న చిన్న పత్రికలు కూడా రచయితల పట్ల గౌరవం ఉంచి విషయం తెలియచేస్తున్నాయి. రెండు మూడు సంకలనాలు వెలువరించిన మీరు ఆ పద్దతి పాటించక పోవడం కూడా బాధ కలిగిస్తున్నది. ధన్యవాదాలు పి. రాజేంద్రప్రసాద్ ( ‘ముద్దాయి తీర్పు’, ‘ఒక ప్రేమకథ’ కథానికల రచయిత)
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
పిల్ల మేఘం
కలియుగ గీతాసారం
కవిత్వం…
సంగీత సురధార-41
అలనాటి అపురూపాలు – 201
యాత్రా దీపిక కృష్ణా జిల్లా – 22. శ్రీకాకుళం
గోమాలక్ష్మికి కోటిదండాలు-3
చిరుజల్లు-137
‘సిరికోన’ చర్చాకదంబం-4
ప్రశ్న
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®