Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రైతు నానీలు

రైతు
దేశానికి వెన్నుముకే
అందుకేనేమో
నడ్డి విరిసేసారు

రైతు రారాజే
తెరపైకి మాత్రమే
పురోగతిలో
కనుమరుగవుతూ

రైతు
అవసరమే
ఓట్లు గుడ్లు పెట్టేటి
బంగారు బాతుగా

రైతు
పిడికిలి బిగిసింది
నిరసనలతో
తమ హక్కుల సాధనకై

నాగలి
పోరుబాట పట్టింది
బతుకు
భవితవ్యం దిశగా

మెతుకు
నిరాహారదీక్ష చేసింది
హక్కుల సాధనే
ధ్యేయంగా

Exit mobile version