Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రైతన్నా

కురిసే వాన కోసం ఆకాశం వైపు చూస్తావు
వానదేవుడు కరుణించాడని ఆనందిస్తావు
మొలిచే మొక్క కోసం ఆశగా చూస్తావు
వానదేవుడు శపించాడని తెలుసుకునే లోపు
వాన నీళ్లలో మునిగిన చేతికి వచ్చిన పంట
ఉబికే కన్నీరు నీకంట.
ఒట్టి చేతులతో ఇంటికి వెళతావు
వచ్చే వర్ష మైనా వస్తుంది వర్షం అంటావు
దేవుడు ఆడే జూదంలో ఓడి గెలుస్తావు
గెలిచి ఓడిపోతావు
ఐనా
నీ గుప్పెడు మెతుకుల కోసమా.. కాదు.
నీ జానెడు పొట్ట కోసమా.. కాదు
ఎందరో కడుపులు నింపటానికి
మళ్ళీ కురిసే వాన కోసం ఆకాశం వైపు చూస్తావు
రైతన్నా
నీకు వందనాలు
వేలవేల పాదాభివందనాలు.

Exit mobile version