[శ్రీ రేడియమ్ రచించిన ‘మిణుగురులు’, ‘చిత్రం’ అనే రెండు చిన్న కవితలని అందిస్తున్నాము.]
1. మిణుగురులు
~
భారీ వర్షాలు
హరితాల ఎడారి
నేడు సహార
పూల పండుగ
కొనబోతే కొరివి
బంగారు పూలు
మతాల పోరు
ప్రపంచ యుద్ధనాంది
బుద్ధం శరణం
దొంగ ఏడుపు
హుళిక్కి వ్యవహారం
కన్నీటి కత్తి
కర్రలు పట్టు
తలలు పగలాలి
దేవర గట్టు
2. చిత్రం
~
దోమల గాత్రం
తుమ్మెదల సంగీతం
ఈగల నాట్యం
రేపటి చిత్రం
