[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘రాతిలో నాతి’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
రామపాదం తాకి బండరాయి
అహల్యగా మారింది
కాని ఆ రాయికి మాత్రం
ఆడవారిపై మక్కువ
పోలేనట్లుంది
శిలల నుంచే
అందమైన శిల్పాన్ని
తీర్చిదిద్ది ఆ ముచ్చట తీర్చుకుంటోంది
అందుకే కళ్ల ముందు కనువిందు
చేసే శిల్పాలు ఎన్నో వెలిసాయి
రాతిలో నాతిని చూపిస్తూ
అతిశయించిన అందంతో ప్రతిఫలిస్తున్నాయి
పెద్దాడ సత్యప్రసాద్ విశాఖపట్నం జిల్లా వాస్తవ్యులు, కవిగా, రచయితగా దశాబ్దాల ప్రయాణం. వీరి కధలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమవడమే కాక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా కూడా ప్రసారం అయ్యాయి. ఇక, వృత్తిగతంగా పాత్రికేయులు. రెండున్నర దశాబ్దాలకు పైగా పాత్రికేయ వృత్తిలో అంకితభావంతో పనిచేస్తున్నారు. రాజకీయ విశ్లేషణలు వీరి ప్రత్యేకత. ప్రస్తుతం ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో న్యూస్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.