Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రాష్ట్రాల పేర్లు – బాలబాలికలకు క్విజ్

[‘రాష్ట్రాల పేర్లు – బాలబాలికలకు క్విజ్’ అనే రచన అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]

  1. రాజులకు నిలయమైన రాష్ట్రమేది?
  2. మూడు ఊళ్ళు కలసిన రాష్ట్రం పేరు చెప్పండి?
  3. ఈనాటికీ ఉత్తరాలు రాసుకునే రాష్ట్రం ఏది?
  4. మణులు, మాణిక్యాలు దొరికే రాష్ట్రం ఏది?
  5. ‘పంజా’ విసిరే రాష్ట్రం, జాబ్ చేసే రాష్ట్రం ఏమిటి?
  6. 36 కోటలు కట్టుకున్న రాష్ట్రమేది?
  7. ‘కూజా ఖండం’ గల రాష్ట్రమేది?
  8. ప్రజల్ని ఒడిలో కూర్చోబెట్టుకుని జాగ్రత్తగా చూసుకునే రాష్ట్రమేది?
  9. మబ్బుల గుడి కలిగిన రాష్ట్రం పేరు చెప్పండి?
  10. చెవిలో టకటక శబ్దం చేసే రాష్ట్రం పేరు ఏది?
  11. ‘బీ’ ఓడిపోయిన రాష్ట్రం పేరు చెప్పండి?
  12. ఉత్తర దిక్కున ఖండం కలిగిన రాష్ట్రం పేరు?
  13. ‘వెళ్ళవా’ అనే రాష్ట్రమేది?
  14. ‘అరుణా! పద!’ అనే రాష్ట్రం పేరు చెప్పండి?
  15. పేరులో రాత్రి ఉన్న రాష్ట్రం పేరు?
  16. పడమర దిక్కున అమ్మాయి నిలుచున్న రాష్ట్రం పేరు?
  17. అన్నింటికన్నా పెద్దదైన రాష్ట్రం పేరు ఏది?
  18. ‘ఆమె ఎందుకు అణా ఇవ్వాలి’? అని ప్రశ్నించే రాష్ట్రం పేరు?
  19. నాగుల భూమి ఉన్న రాష్ట్రమేది?
  20. దేశంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రమేది?

జవాబులు:

1. రాజస్తాన్ 2. త్రిపుర 3. ఉత్తరప్రదేశ్ 4. మణిపూర్ 5. పంజాబ్ 6. చత్తీస్‌గడ్ 7. జార్ఖండ్ 8. ఒడిశా 9. మేఘాలయ 10. కర్ణాటక 11. బీహార్ 12. ఉత్తరాఖండ్ 13. గోవా 14. అరుణాచల్ ప్రదేశ్ 15. గుజరాత్ 16. పశ్చిమబెంగాల్ 17. మహారాష్ట్ర 18. హర్యానా 19. నాగాలాండ్ 20. తెలంగాణ

Exit mobile version