1.
అంతర్జాలం
ఒక మాయాజాలం
నేరాలు, ఘోరాలకూ
నిలయం
2.
దూరదర్శన్‌తో
కాలక్షేపం బాగుంది
మషుల మధ్య
దూరం పెంచింది
3.
కాలం కాటేస్తుంది
శృతి మించినప్పుడు
గమనించి
నడుచుకోవాలి
4.
పూల మకరందం
తేనెటీగలు గ్రోలు
పండ్ల మకరందం
మనుషులు గ్రోలు
5.
నీ విధి నీవు సక్రమంగా
నిర్వర్తించు
సమాజం
బాగుపడుతుంది
6.
మౌస్, వ్రేళ్ళు
నాట్యం చేయిస్తాయి కంప్యూటర్ని
ఫలితం
పని సానుకూలం
7.
మౌస్ కంప్యూటర్ని
ముద్దాడుతుంది
వ్రేళ్ళు కీ బోర్డుని
ముద్దాడుతాయి
8.
రిటైర్మెంటే
నరకం ఆరోగ్యమున్నప్పుడు
ఐతే వెతుక్కో
ఏదో ఒక పని
శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి (ఆర్.వి. చారి) గారిది తెనాలి. ప్రసుతం హైద్రాబాదులో సెటిల్ అయినారు.
చారి గారు ఈ.ఎస్.ఐ. కార్పొరేషన్లో సూపరింటెండెంట్‌గా పనిచేసి రిటైర్ అయినారు. వారి మేనమామ గారు కీ.శే. పూసపాటి నాగేశ్వర రావు. అయన వీరబ్రహ్మేంద్ర చరిత్ర పద్య కావ్యం రచించి యున్నారు. కాగా అయన అష్టావధాని కూడా. వారి స్వగ్రామము రావెల్, గుంటూరు జిల్లా. చారి గారికి తమ మామయ్య మాదిరి పద్యాలు వ్రాయాలని కోరిక. కానీ ఛందస్సు తెలిసుండాలిగా. అందుచే వ్రాయలేక పోయారు.
కానీ నానీలు వ్రాయుటకు వారి కుమార్తె శ్రీమతి ప్రత్తిపాటి సుభాషిణి కారణం. ఆమెది బాపట్ల, గుంటూరు జిల్లా. టీచర్‌గా పని చేస్తున్నారు. వారు ఈ మధ్యనే ఒకానొక సంధర్బములో హైదరాబాద్ వొచ్చి తాను రచించిన ‘నిశ్శబ్ద పర్జన్యాలు’ చారిగారికి ఇచ్చారు. అవి చాలా బాగున్నాయి. అవి చదివిన తరువాత, ఆ స్పూర్తితో, నానీలు వ్రాయాలని కోరికతో చారిగారు నానీలు వ్రాసారు. పద్యాలు వ్రాయాలనే వారి కోరిక ఈ విధంగా తీరుచున్నది.