ముద్దుల నానీలు-2
10.
డోర్, డోర్ కర్టెన్
ముద్దాడుకున్నాయి
ఎవరినీ
చూడకుండా చేసాయి
11.
నీళ్లు
వరి మొక్కల్ని ముద్దాడాయి
ఆరు నెలలకు
బిడ్డలను కన్నవిగా!
12.
ముద్దాడితే
పోయేదేముంది
ఏమీపోదూ
కాకపోతే ఎంగిలౌతుంది
13.
నీరు నిప్పు
ముద్దాడుకున్నాయి
ఆవిరైపోయింది
వారి ఆశ!
14.
ముద్దాడి ముద్దాడి
పెదవులేమయ్యాయో
పెదవులసంగతి
మూతికెరుక
15.
చేయి చేయి
ముద్దాడుకున్నాయి
అదే సంస్కారమైంది
కోవిద్ సమయములో
16.
నింగి నేల
ముద్దాడుకున్నాయి
నేల తల్లి
పులకించిపోయె
17.
ఇంకేమి
ముద్దాడుకున్నాయి
చూసేట్లు ముద్దాడుకుంటేగా
తెలియటానికి
18.
ఇక చాలించు
ముద్దుల నానీలు
మరేం చేస్తాం
ముడుచుకోక
శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి (ఆర్.వి. చారి) గారిది తెనాలి. ప్రసుతం హైద్రాబాదులో సెటిల్ అయినారు.
చారి గారు ఈ.ఎస్.ఐ. కార్పొరేషన్లో సూపరింటెండెంట్‌గా పనిచేసి రిటైర్ అయినారు. వారి మేనమామ గారు కీ.శే. పూసపాటి నాగేశ్వర రావు. అయన వీరబ్రహ్మేంద్ర చరిత్ర పద్య కావ్యం రచించి యున్నారు. కాగా అయన అష్టావధాని కూడా. వారి స్వగ్రామము రావెల్, గుంటూరు జిల్లా. చారి గారికి తమ మామయ్య మాదిరి పద్యాలు వ్రాయాలని కోరిక. కానీ ఛందస్సు తెలిసుండాలిగా. అందుచే వ్రాయలేక పోయారు.
కానీ నానీలు వ్రాయుటకు వారి కుమార్తె శ్రీమతి ప్రత్తిపాటి సుభాషిణి కారణం. ఆమెది బాపట్ల, గుంటూరు జిల్లా. టీచర్‌గా పని చేస్తున్నారు. వారు ఈ మధ్యనే ఒకానొక సంధర్బములో హైదరాబాద్ వొచ్చి తాను రచించిన ‘నిశ్శబ్ద పర్జన్యాలు’ చారిగారికి ఇచ్చారు. అవి చాలా బాగున్నాయి. అవి చదివిన తరువాత, ఆ స్పూర్తితో, నానీలు వ్రాయాలని కోరికతో చారిగారు నానీలు వ్రాసారు. పద్యాలు వ్రాయాలనే వారి కోరిక ఈ విధంగా తీరుచున్నది.