Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పువ్వుల పొడుపు కథలు-2

[బాలబాలికల కోసం పువ్వుల పొడుపు కథలు అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్. ఇది రెండవ భాగం.]

ప్రశ్నలు:

13.
కరేబియన్ దీవులు, దక్షిణ అమెరికా పువ్వు
రేకులు ఔషదంగా ఉపయోగించే పువ్వు
ఫాబేసి కుటుంబానికి చెందిన పువ్వు
పగడపు రత్నం అనే బిరుదు గల పువ్వు

14.
దుర్వాసన కలిగిన పువ్వు
శవం పువ్వని పేరున్న పువ్వు
మలేషియా థాయ్‌లాండ్‌ల పువ్వు
ప్రపంచంలోనే అతి పెద్ద పువ్వు

15.
సుమత్రా ద్వీపానికి చెందిన పువ్వు
కుళ్ళిన చేప వాసన కలిగిన పువ్వు
ఆరేసి కుటుంబానికి చెందిన పువ్వు

16.
వుల్ఫియా గ్లోబోసా శాస్త్రీయ నామం
ప్రపంచంలోనే అత్యంత చిన్న పుష్పం
ప్రాకాశావంతమైన ఆకుపచ్చ రంగు పుష్పం

17.
పాము పడగ ఆకారంలో ఉండే పువ్వు
పేరులో శాంతిని పెట్టుకున్న పువ్వు
‘స్పాతి ఫిలమ్’ పేరున్న ‘ఆరేసి’ పువ్వు

18.
తెల్లగా దెయ్యంలా ఉండే పువ్వు
ఆకులు, కాండం లేకుండా ఉన్న పువ్వు
అంతరించి పోతున్న ఆర్కిడెని పువ్వు

19.
పుష్పించే అరుదైన పుదీనా జాతి పువ్వు
తీవ్రమైన ప్రమాదంలో ఉన్న పువ్వు
క్లేలెన్సులు అనే పేరు గల పువ్వు

20.
మధ్య అమెరికాకు చెందిన పువ్వు
అంతరించి పోయే దశలో ఉన్న పువ్వు
గాలి మొక్కలుగా పేరు పొందిన పువ్వు
బలం, అనుకూలతల మిళిత పువ్వు

21.
పాపారేసి కుటుంబానికి చెందిన పువ్వు
ఆసియన్ బ్లీడింగ్ హార్ట్ అని పేరున్న పువ్వు
కొండల్లో రాతి పగుళ్ళలో పెరిగే పువ్వు

22.
హిమాలయ ప్రాంతపు అరుదైన పువ్వు
మెకోనోప్సిన్ ఆక్యులేటా శాస్త్రీయ నామం
నీలపు రంగు రెక్కలు పసుపు కేసరాల పుష్పం

23.
ఆడపిల్లల చెప్పును పోలి ఉండే పువ్వు
భారతీయపు అరుదైన సున్నితమైన పువ్వు
అంతరిస్తున్న కారణంగా రక్షింపబడే పువ్వు

జవాబులు:

13.చిలక ముక్కు పువ్వు 14. రఫ్లీషియా 15. టైటాన్ ఆరమ్ కారియన్ పువ్వు (అమారో ఫాలాస్ టైటానియమ్) 16. వాటర్ మీల్ పువ్వు 17. పీస్ లిల్లీ 18. ఘోస్ట్ ఆర్కిడ్ 19. అకాంతోమింతాం ఇలిసిఫోలియా (శాన్ డియాగో ధోర్న్ మింట్) 20. టిల్లాడ్సియా 21. లాంప్రో కాప్నోస్ పువ్వు 22. హిమాలయన్ బ్లూపాపి 23. లేడిస్ స్లిప్పర్ ఆర్కిడ్

Exit mobile version