[బాలబాలికల కోసం పువ్వుల పొడుపు కథలు అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్. ఇది మొదటి భాగం.]
ప్రశ్నలు:
1.
అమెరికాకు చెందిన పువ్వు
విషపూరితమైన పువ్వు
స్పాడిక్స్ ఉన్న పుష్ప గుచ్చము
ఆరేసి కుటుంబ పువ్వు
2.
పువ్వులన్నీ సువాసన ఇస్తాయి
కానీ ఈ పువ్వు వస్త్రాలనిస్తుంది
3.
ఈ పువ్వు జడలో పెట్టుకోలేము
ఈ పువ్వు కాశ్మీరులో ఉంటుంది
ఈ పువ్వు తినడానికి వాడతాము
4.
ఆకుల రంగులో ఉండే పువ్వు
ఘాటైన సెంటు కొట్టుకునే పువ్వు
5.
బురదలో ఉన్న స్వచ్ఛంగా ఉంటుంది
గుండ్రని ఆకులతో నీటిలో ఉంటుంది
నెలంబోనేసి కుటుంబలో ఉంటుంది
6.
భారతదేశంలోనే అరుదైన పుష్పం
పుష్కరానికో సారి పూసే పువ్వు
పశ్చిమ కనుమలలో పెరిగే పుష్పం
7.
నైట్ క్వీన్ బిరుదు కలిగిన పువ్వు
ధనికమైనదని పేరు కలిగిన పువ్వు
మెక్సికో దేశపు కాక్టస్ జాతి పువ్వు
8.
లేత నారింజ రంగులో డిస్క్ పువ్వు
వీల్ పిన్ కుషన్ అనే పేరున్న పువ్వు
అంతరించి పోతున్న దక్షిణాఫ్రికా పువ్వు
9.
లిల్లీ పూలకు అక్కలు
వసంతంలో పూచే పువ్వులు
ఆకర్షణీయమైన రంగులు
అత్యంత విలువైన పువ్వులు
10.
ఉత్తరాఖండ్ రాష్ట్ర పుష్పం
పోస్టల్ స్టాంప్ ఉన్న పుష్పం
ఆస్టరేసి కుటుంబ పుష్పం
11.
టెన్నిస్ బంతుల్లాంటి పువ్వులు
హరి ప్రియ పేరు గల పువ్వులు
సుగంధ ధ్రవ్యాలలో వాడే పువ్వులు
12.
భూమ్మీదే అరుదైన పువ్వు
ప్రేమ అభిరుచి కలగలసిన పువ్వు
యూకె న్యూజిలాండ్ ల్లోని పువ్వు
జవాబులు:
1.ఆంధూరియా 2. పత్తి పువ్వు 3. కుంకుమ పువ్వు 4. సంపెంగ పువ్వు 5. తామర పువ్వు 6. నీలకురింజి 7. కడుపుల్ పువ్వు 8. కధారిన్ పువ్వు 9. తులిప్ పూలు, 10. బ్రహ్మ కమలం 11. కదంబ పూలు 12. మిడిల్ మిస్ట్ రెడ్ పువ్వు
డా. కందేపి రాణీప్రసాద్ MA, MSc, PHD, బాల సాహితీ వేత్త, కవయిత్రి, అనువాదకులు, చిత్ర కళాకారిణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. రాణీ ప్రసాద్ ఆర్ట్ పేరుతో హాస్పిటల్ వేస్ట్‌తో 4000 బొమ్మలను సృష్టించారు. బాల సాహిత్యంలో 48 పుస్తకాలు రచించారు. ‘తెలుగు బాల సాహిత్యంలో సైన్స్ రచనలు’ అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. తెలుగు విశ్వ విద్యాలయంలో బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని నెలకొల్పారు. మిల్కీ మ్యూజియం, స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ లను తమ ఆసుపత్రిలో పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. తమ సొంత ఆసుపత్రిలో ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద పిల్లల కోసం తెలుగు పాట, బొమ్మ పెట్టి ప్రింట్ చేస్తున్నారు. సైన్సు, యాత్రా సాహిత్యం విరివిగా రాస్తున్నారు. కళాభారతి, కవిత వాణి, చిత్ర కళారాణి అనే ఎన్నో బిరుదులను, 6 వరల్డ్ రికార్డ్స్నూ సొంతం చేసుకున్నారు.