[శ్రీ కయ్యూరు బాలసుబ్రమణ్యం రచించిన ‘పుస్తకం’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]
నీ ప్రతి అక్షరం
నా మానస వీణను
మీటుతూ
నీ ప్రతి పదం
నా హృదయాంతరాన్ని
సృశిస్తూ
నీ ప్రతి వాక్యం
నా మనో ఫలకాన్ని
పలకరిస్తూ
నీ సాంగత్యం
నా మూర్తిమత్వాన్ని
తీర్చిదిద్దుతూ
నను మనిషిగా
నడిపిస్తున్న నీకు
ఏమివ్వగలను?
హృదయ పుర్వక
ఓ ఆలింగనం తప్ప