[శ్రీ వంగల సంతోష్ రచించిన ‘పురిటి నొప్పులు..!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఎన్ని బాధల గుండెనో
ఈ నేల మీద ఆడ జన్మకు
ఎన్ని నొప్పులను తీసిందో
పంటి బిగువున అదిమిపట్టిన
ఆ తల్లి (చెల్లి)యె
పురుడుబోసేనో ఓ కొత్త జీవానికి..!
బిడ్డకు బొడ్డు కోసి పేరు పెట్టిన చోట
ఆ తల్లి పురిటి నొప్పుల వేదన
ఉయ్యాల ఊగే శిశువుకేం ఎరుకా..?
నోటి లోని మాటకు
నొసటి మీద చెమటకు
ఈ అభాగ్య జీవుల
బతుకుల్లో
అల్లుకున్న పేగుకు
అందించే ఆయువే
ఈ పురిటి నొప్పుల వేదన
తల్లికాక ఇంకెవరు భరించెదరు..!?
ఏ కుహరపు చీకట్లనైనా చీల్చి
పండు వెన్నెల వెలుగులను నింపే
తారా జువ్వల కాంతుల కోసం
నవ మాసాలు గర్భాన మోసి
ప్రసవ వేదనకు జడ్వని తల్లి (చెల్లి)కి
బిడ్డ జననమే చిరాయువు కదా..!!