Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పురాణ విజ్ఞాన ప్రహేళిక-9

[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]

భారతీయ పురాణాలు విజ్ఞాన గనులు. చదువుతున్న కొద్దీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. పురాణేతిహాసాల గాథలన్నీ పెద్దల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, పండితుల ద్వారా, ప్రవచనకర్తల ద్వారా మనలో చాలామందిమి వినే ఉంటాము. మనలో కొందరు రామాయణ, భారత భాగవతాది గ్రంథాలను నిత్య పారాయణం చేస్తూనే ఉంటారు. వీటిలోని విశేషాలను మరల మరల మననం చేసుకున్నా వాటి ఆస్వాదనా గుణం తగ్గుముఖం పట్టదు.

అందుకే, భారతీయ పురాణాలు, ఇతిహాసాలపై పాఠకులకున్న అవగాహననీ, విజ్ఞానాన్ని మరోసారి వెలికితెచ్చేలా, సంచికలో, శ్రీనివాసరావు సొంసాళె గారు ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్ నిర్వహిస్తున్నారు. ఇది వారం వారం కొనసాగుతుంది.

~

ప్రశ్నలు:

  1. విష్ణు, బ్రహ్మాపురాణాల ప్రకారం, వినత – కశ్యపుల కూతురు, సగరుడి భార్య, అరవై వేల మంది కొడుకులున్న ఆమె ఎవరు?
  2. వనవాసం సందర్భంగా, రాముడిని, సీతను అడవిలో దింపడానికి రథం నడిపినదెవరు?
  3. స్కంద పురాణం ప్రకారం, సుబ్రహ్మణ్యస్వామిని భర్తగా పొందడానికి, తన సోదరి అమృతవల్లితో కలసి, ఆకాశగంగ తీరాన తపస్సు చేసిన మహావిష్ణువు కూతురు ఎవరు?
  4. తనని తిడుతున్న గురువును చంపాలనుకుని ఆయన ఇంటికి వెళ్ళగా, ఆ గురువు తనని పొగడడం చూసి చింతించి, గురువధ చేయాలనుకున్నవారికి ఏ శిక్ష విధిస్తారో తెలుసుకుని ఆ ప్రకారం మరణించినవాడూ, ‘శ్రీకృష్ణ విలాసం’ రచించిన సంస్కృత కవి ఎవరు?
  5. బల్లేసు మల్లయ్య అను శివభక్తుడు (పూర్వగాథాలహరి ప్రకారం), కుంచాన్ని లింగంగా భావించి పూజ చేయగా, అది నిజంగానే లింగంగా మారుతుంది. అందుకని____ అనే పేరొచ్చింది.
  6. మహాభారతం ప్రకారం, సుబలుడి కొడుకు, శకుని చిన్న సోదరుడు, అర్జునుడి కొడుకు ఐరావంతుడి చేతిలో మరణించినదెవరు?
  7. విష్ణుపురాణం ప్రకారం, లంచం తీసుకునేవాళ్ళు అనుభవించే నరకం ఏది?
  8. మహాభారతం ప్రకారం, పాండవులకు లక్క ఇల్లు నిర్మించిన దుర్యోధనుని మంత్రి ఎవరు?
  9. గంధర్వుడు మణిమయుడి కూతురు, రాక్షసుడు సుకేశుని భార్య, మాల్యవంతుడు, మాలి, సుమాలిల తల్లి – ఎవరు?
  10. హిమత్వర్వతానికి ఉత్తరాన ఉండే శత యోజనాల విస్తీర్ణం గల ఏ సరస్సు కొలనులోని కమలాల నాళంలో పదవీభ్రష్టుడైన ఇంద్రుడు దాక్కున్నాడు?

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 మే 27 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక-9 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2025 జూన్ 01 తేదీన వెలువడతాయి.

జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

పురాణ విజ్ఞాన ప్రహేళిక 7 జవాబులు:

1.రుమణ్వతుడు/రుమణ్వానుడు 2. రాగిణి 3. రుద్రప్రయాగ 4. రంభుడు 5. రయుడు 6. విచఖ్నుడు 7. వృధ్ధక్షత్రుడు 8. శమంత పంచకం 9. శశిబిందుడు 10. శరవణం

పురాణ విజ్ఞాన ప్రహేళిక 7 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. పురాణ విజ్ఞాన ప్రహేళికలో ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణిస్తాము.
  2. ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  3. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version