Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పురాణ విజ్ఞాన ప్రహేళిక-8

[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]

భారతీయ పురాణాలు విజ్ఞాన గనులు. చదువుతున్న కొద్దీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. పురాణేతిహాసాల గాథలన్నీ పెద్దల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, పండితుల ద్వారా, ప్రవచనకర్తల ద్వారా మనలో చాలామందిమి వినే ఉంటాము. మనలో కొందరు రామాయణ, భారత భాగవతాది గ్రంథాలను నిత్య పారాయణం చేస్తూనే ఉంటారు. వీటిలోని విశేషాలను మరల మరల మననం చేసుకున్నా వాటి ఆస్వాదనా గుణం తగ్గుముఖం పట్టదు.

అందుకే, భారతీయ పురాణాలు, ఇతిహాసాలపై పాఠకులకున్న అవగాహననీ, విజ్ఞానాన్ని మరోసారి వెలికితెచ్చేలా, సంచికలో, శ్రీనివాసరావు సొంసాళె గారు ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్ నిర్వహిస్తున్నారు. ఇది వారం వారం కొనసాగుతుంది.

~

ప్రశ్నలు:

  1. బ్రహ్మపురాణం ప్రకారం, ఒక ముని – మహేంద్రపర్వతం దగ్గర తపస్సు చేసుకుంటున్న పరశురాముని వద్దకు వెళ్ళి, “సముద్రుడు గోకర్ణాన్ని ముంచేసాడు. నీవు వచ్చి రక్షించు. దుష్టసంహారార్థం ఆయుధం చేపట్టినా పాతకం రాదు” అన్నాడు. ఆ ముని ఎవరు?
  2. ఉత్తర రామాయణాన్ని అనుసరించి, విభీషణుడి భార్య సురమ తండ్రియైన గంధర్వుడెవరు?
  3. రామాయణం ప్రకారం జనకమహారాజు దగ్గరకి వచ్చి సీతను రావణాసురుడికి ఇవ్వమని అడిగిన రావణుడి పురోహితుడెవరు?
  4. భారతాన్ని అనుసరించి, సూర్యుని కూతురు తపతిని వివాహమాడినవాడు, రుక్షరుడి కుమారుడు, చంద్రవంశపు రాజు, ప్రాతః సాయంసంధ్యలో స్మరింపదగినాడు ఎవరు?
  5. అద్భుత రామాయణం ప్రకారం, భద్రకాళి రూపంలోని సీత చేతిలో మరణించిన రావణుని సోదరుడు, పుష్కరద్వీప వాసి ఎవరు
  6. వివాహానికి ముందే గర్భవతిగా ఉండి, వివాహమైన తరువాత ప్రసవించిన స్త్రీల సంతానాన్ని ఏమందురు?
  7. భాగవతం ప్రకారం యదువంశ నాశనకారియైన ముసలానికి జన్మనిచ్చినవాడు, జాంబవతి, శ్రీకృష్ణుల కుమారుడెవరు?
  8. వరాహా పురాణాన్ని అనుసరించి, విష్ణుమూర్తిని ప్రార్థించిన తరువాత, నారదుడిగా పుట్టిన, సత్యయుగంలోని అవంతీ నగరంలోని బ్రాహ్మణుడి పేరేమిటి?
  9. మత్స్యపురణాన్ని అనుసరించి – తామ్ర, కశ్యపుల ఏ కూతురు నుండి గుర్రాలు, ఒంటెలు, గాదిదలు జన్మించాయి?
  10. భారతం ప్రకారం ఏ మంత్రాన్ని ఉచ్చరిస్తే, సర్పాలు దగ్గరకు రావు?

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 మే 20 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక-8 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2025 మే 25 తేదీన వెలువడతాయి.

జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

పురాణ విజ్ఞాన ప్రహేళిక 6 జవాబులు:

1) ఉపశ్లోకుడు 2) ఆగ్నేయాస్త్రం 3) కుంభీపాకం 4) ద్వాదాశాదిత్యులు 5) పుంజికస్తల 6) బహు దంతకం 7) మార్గశీర్ష మాసం 8) యమున 9) రత్నమాల 10) రమ

పురాణ విజ్ఞాన ప్రహేళిక 6 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. పురాణ విజ్ఞాన ప్రహేళికలో ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణిస్తాము.
  2. ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  3. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version