Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పురాణ విజ్ఞాన ప్రహేళిక-6

[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]

భారతీయ పురాణాలు విజ్ఞాన గనులు. చదువుతున్న కొద్దీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. పురాణేతిహాసాల గాథలన్నీ పెద్దల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, పండితుల ద్వారా, ప్రవచనకర్తల ద్వారా మనలో చాలామందిమి వినే ఉంటాము. మనలో కొందరు రామాయణ, భారత భాగవతాది గ్రంథాలను నిత్య పారాయణం చేస్తూనే ఉంటారు. వీటిలోని విశేషాలను మరల మరల మననం చేసుకున్నా వాటి ఆస్వాదనా గుణం తగ్గుముఖం పట్టదు.

అందుకే, భారతీయ పురాణాలు, ఇతిహాసాలపై పాఠకులకున్న అవగాహననీ, విజ్ఞానాన్ని మరోసారి వెలికితెచ్చేలా, సంచికలో, శ్రీనివాసరావు సొంసాళె గారు ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్ నిర్వహిస్తున్నారు. ఇది వారం వారం కొనసాగుతుంది.

~

ప్రశ్నలు:

  1. భాగవతాన్ని అనుసరించి, సాత్వత తంత్రమనే వైష్ణవ స్మృతిని కల్పించిన వాడు, త్రివక్ర, కృష్ణులకు పుట్టినవాడు ఎవరు?
  2. భారతం ప్రకారం ఏ అస్త్రాన్ని మొదట బృహస్పతి భరధ్వాజునికి, భరద్వాజుడు అగ్నివేశునికి, అగ్నివేశుడు ద్రోణుడికి, ద్రోణుడు అర్జునుడికి యిస్తారు?
  3. భాగవతాన్ని అనుసరించి ఇరవై ఎనిమిది నరకాలలో ఒకటి – అహారం కోసం పశు పక్ష్యాలులను వధించేవారిని, బాగా మరిగే నూనెలో తోస్తారు. ఆ నరకం పేరు?
  4. అగ్నిపురాణాన్ని అనుసరించి వరుణుడు. సూర్యుడు, సహస్రాంసుడు, ధాత, తపసుడు, సవిత్రుడు, గభస్తి, రవి, పర్జన్యుడు, త్వష్ట. మిత్రుడు, విష్ణువు – అదితి, కశ్యపులకు జన్మించిన వీరిని ఏమని పిలుస్తారు?
  5. కంబ రామాయణం ప్రకారం, బృహస్పతి శిష్యురాలైన ఒక అప్సరస ఒకసారి మోహావేశంలో బృహస్పతిని తన కోరిక తీర్చమంటుంది. ఆయన ఆమెను కోతిగా పుట్టమని శపించాడు. ఈమె ‘కేసరి’తో విహరించాక శివుడి దయ వలన హనుమంతుడు పుడతాడు. శిష్యురాలైన ఈమె ఎవరు?
  6. భారతం ప్రకారం, బ్రహ్మ రాసిన నీతి శాస్త్ర గ్రంథంలో పదివేల అద్యాయాలున్నాయి. పురందరుడు దీన్ని అయిదువేల అధ్యాయాలతో సంక్షిప్తం చేసిన గ్రంథం పేరేమిటి?
  7. భారతాన్ని అనుసరించి ఏ మాసంలో కేవలం ఆహారం తీసుకుంటూ జీవిస్తే, అన్ని వ్యాధుల నుండి, పాపాల నండి విముక్తులవుతారు? ఈ నెలలో ద్వాదశి రోజున కేశవుణ్ణి పూజించి ఉపవాసముంటే అశ్వమేధ యజ్ఞం చేసిన ఫలం వస్తుంది. ఈ మాసం పేరు?
  8. వామన పురాణం ప్రకారం సతీదేవి విరహంతో పిచ్చివాడిగా తిరుగుతున్న శివుడు కాళిందీ నదిలో దూకినప్పుడు. ఆ నది నీళ్లు నల్లగా మారాయి. కాళిందీ నదికి ఇంకో పేరు?
  9. బ్రహ్మ వైవర్త పురాణాన్ని అనుసురించి ‘బలి’ కూతూరు వామనుడిని చూచి తనకి అలాంటి కొడుకు వుండాలని కోరుకోవడం వలన, తర్వాత జన్మలో ‘పూతన’గా పుట్టినది. ఆమె ఎవరు?
  10. తన కళ్లతో సూర్యుని కొడుకు దేవతుడితో, అతని అశ్వంతో రమించిన ఆమె ఎవరు?

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 మే 06 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక-6 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2025 మే 11 తేదీన వెలువడతాయి.

జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

పురాణ విజ్ఞాన ప్రహేళిక 4 జవాబులు:

1) ఉచ్చైశ్రవం 2) కదుడు 3) కీర్తిముఖుడు 4) ఆణి మాండవ్యుడు 5) విశోకుడు 6) వీరభద్రుడు 7) వీర వర్మ 8) పంచ దేవులు 9) జరుడు 10) తోరణ స్ఫాటికం

పురాణ విజ్ఞాన ప్రహేళిక 4 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. పురాణ విజ్ఞాన ప్రహేళికలో ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణిస్తాము.
  2. ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  3. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version