Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పురాణ విజ్ఞాన ప్రహేళిక-5

[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]

భారతీయ పురాణాలు విజ్ఞాన గనులు. చదువుతున్న కొద్దీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. పురాణేతిహాసాల గాథలన్నీ పెద్దల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, పండితుల ద్వారా, ప్రవచనకర్తల ద్వారా మనలో చాలామందిమి వినే ఉంటాము. మనలో కొందరు రామాయణ, భారత భాగవతాది గ్రంథాలను నిత్య పారాయణం చేస్తూనే ఉంటారు. వీటిలోని విశేషాలను మరల మరల మననం చేసుకున్నా వాటి ఆస్వాదనా గుణం తగ్గుముఖం పట్టదు.

అందుకే, భారతీయ పురాణాలు, ఇతిహాసాలపై పాఠకులకున్న అవగాహననీ, విజ్ఞానాన్ని మరోసారి వెలికితెచ్చేలా, సంచికలో, శ్రీనివాసరావు సొంసాళె గారు ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్ నిర్వహిస్తున్నారు. ఇది వారం వారం కొనసాగుతుంది.

~

ప్రశ్నలు:

  1. దేవీ పురాణాన్ని ఆనుసరించి, బుద్ధిని మాయ కప్పేస్తుందని నిరూపించడానికి, విష్ణువు నారదుని స్త్రీగా మారుస్తాడు. సౌభాగ్య సుందరిగా నారదుడు వివాహం చేసుకున్న రాజు పేరేమిటి?
  2. ఉత్తర రామాయణం ప్రవారం సుమాలి కూతురు, విశ్రావసుడి భార్య, రావణ, కుంభకర్ణ, విభీషణ. శూర్పణఖల తల్లి ఎవరు?
  3. ధర్మరాజు భార్య, యౌధేయుని తల్లి, శైభ్యరాజు గోవాసుడి కుమార్తె ఎవరు?
  4. హరివంశం ప్రకారం, ఉగ్రసేనుడి భార్యను వలచిన రాక్షసుడు ఆమె స్నానానికి వెళితే, ఉగ్రసేనుడి రూపంలో వచ్చి రమించినవాడు, కంసునికి జన్మనిచ్చిన వాడి పేరు?
  5. శ్రీరాముడి వానర సైన్యంలో ఒకడైన ఇతడు ఏభై ఒక్క కోట్ల వానర సైన్యానికి సర్వ సైన్యాధిపతి. ఇతని పేరు?
  6. కన్యకా పురాణాన్ననుసరించి, పూర్వజన్మలో నలకూబరుడై. తాను చేయమన్న యుద్ధం చేయనందులకు బ్రహ్మ యితన్ని వైశ్యుడిగా పుట్టమని శపించిన వాడు, కన్యకాంబకు తండ్రి అయిన యితని పేరు?
  7. జ్యోతిశాస్త్ర ప్రవీణుడు, భూమి గుండ్రగా ఉంటుందని అందరి కన్నా ముందు ప్రకటంచినవాడు ఎవరు?
  8. ఉత్తర రామాయణాన్ని అనుసరించి రావణాసురుడు, రంభతో ఒక రాత్రి, పురాణ ప్రసిద్ధమైన శిల మీద గడిపుతాడు. ఆ శిల పేరేమిటి?
  9. అవంతి రాజులైన విందానువిందుని చెల్లెలు శ్రీకృష్ణుని మేనత్త అయిన రాజధిదేవి కుమార్తె, కృష్ణుని భార్య ఎవరు?
  10. కంబ రామాయణాన్ని అనుసరించి, రావణుడు కదంబవనం లోని స్వస్తికా వనంలో ఉన్న మునిని, అతని శిష్యులను, తన చంద్రహాసంతో అవమానపరిస్తే, ఆ ముని రావణుడి చంద్రహాసం పనికి రాకుండా ఉండేటట్లు శపిస్తాడు. ఎవరా ముని?

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 ఏప్రిల్ 29 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక-5 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2025 మే 04 తేదీన వెలువడతాయి.

జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

పురాణ విజ్ఞాన ప్రహేళిక 3 జవాబులు:

1.పంచాయతనం 2. యవనులు 3. మహిషాసురుడు 4. ఒక నరకం 5. వైదేహుడు 6. శతానందుడు 7. రాత్రి 8. హూణులు 9. అగ్నిశౌచం 10. అశ్వత్థ వృక్షాలు

పురాణ విజ్ఞాన ప్రహేళిక 3 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. పురాణ విజ్ఞాన ప్రహేళికలో ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణిస్తాము.
  2. ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  3. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version