[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్ని పాఠకులకు అందిస్తున్నాము.]
భారతీయ పురాణాలు విజ్ఞాన గనులు. చదువుతున్న కొద్దీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. పురాణేతిహాసాల గాథలన్నీ పెద్దల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, పండితుల ద్వారా, ప్రవచనకర్తల ద్వారా మనలో చాలామందిమి వినే ఉంటాము. మనలో కొందరు రామాయణ, భారత భాగవతాది గ్రంథాలను నిత్య పారాయణం చేస్తూనే ఉంటారు. వీటిలోని విశేషాలను మరల మరల మననం చేసుకున్నా వాటి ఆస్వాదనా గుణం తగ్గుముఖం పట్టదు.
అందుకే, భారతీయ పురాణాలు, ఇతిహాసాలపై పాఠకులకున్న అవగాహననీ, విజ్ఞానాన్ని మరోసారి వెలికితెచ్చేలా, సంచికలో, శ్రీనివాసరావు సొంసాళె గారు ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్ నిర్వహిస్తున్నారు. ఇది వారం వారం కొనసాగుతుంది.
~
ప్రశ్నలు:
- ఆది శంకరాచార్యుల వారి గురువు, గౌడపాదాచార్యుల వారి శిష్యులైన వారి పేరు?
- పద్మపురాణం ప్రకారం, కాశీరాజు పౌండ్రకుని కుమారుడు, ద్వారక మీదకి కృత్యను ప్రయోగించి, అది ఫలించక కృష్ణుని చేతిలో మరణించినవాడెవరు?
- ఆనంద రామాయణం ప్రకారం, హనుమంతుడి చెమట బిందువులు ఒక మొసలి మీద పడగా, జన్మించినవాడెవరు?
- మహాభారతం ప్రకారం ఈ రాజు ఒక గొప్ప దాత. నిరాహారంగా 40 రోజులున్నాక, దొరికిన ఆహారాన్ని ఒక అతిథికి, శూద్రుడికి, చండాలుడికి, ఓ కుక్కకి పంచి, దేవతల వరాలు పొందిన ఇతనెవరు?
- భాగవతం ప్రకారం సుతపుడనే ప్రజాపతి, మరుజన్మలో కృష్ణుడికి తండ్రిగా పుడతాడు. అతని పేరు?
- పద్మపురాణం ప్రకారం దేవరాతుడి కూతురు, ఇక్ష్వాకు భార్య ఈమె. తన సంవత్సర తఫఃఫలితాన్ని ఓ పందికి ధారపోసి, శాపవిమోచనం కలిగిస్తుంది. తరువాత భార్యాభర్తలిద్దరూ లక్ష్మీవిష్ణువులుగా జన్మిస్తారు. ఆమె పేరు?
- భాగవతం ప్రకారం శాపవశాత్తు మొసలిగా జన్మించి, గజేంద్ర మోక్షం సందర్భంగా, విష్ణువుచే సంహరించబడి శాపవిమోచనం పొందిన గంధర్వుడు ఎవరు?
- భారతం ప్రకారం కుంతీదేవి కర్ణుడిని – కుంతిభోజ రాజ్యంలో ఉన్న ఏ నదిలో వదిలింది?
- భారతం లోని ఆదిపర్వం ప్రకారం, కళింగ రాజు అశోకుడిగా జన్మించిన అసురుడు ఎవరు?
- భారతం ప్రకారం, హరిశ్చంద్రుడు అనేక జైత్రయాత్రలు దిగ్విజయంగా చేసిన రథం పేరు?
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 నవంబర్ 25వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక-35 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2025 నవంబర్ 30వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
పురాణ విజ్ఞాన ప్రహేళిక 33 జవాబులు:
1.కుబ్జ 2. దేవదత్తం 3. ధర్మదత్తుడు 4. నకులుడు 5. నృషదుడు 6. భవతి/సుభగే/భగినీ 7. మంగళ చండిక 8. మహోదయపురి 9. రుమ 10. రైవతం
పురాణ విజ్ఞాన ప్రహేళిక 33 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- పి.వి. రాజు, హైదరాబాద్
- రామలింగయ్య టి, తెనాలి
- శ్రేయా ఎస్. క్షీరసాగర్, దావణగెరె
- సునీతా ప్రకాష్, బెంగుళూరు
- రామవరపు గిరిజాశంకర రావు, పూణే
వీరికి అభినందనలు.
గమనిక:
- పురాణ విజ్ఞాన ప్రహేళికలో ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణిస్తాము.
- ఈ క్విజ్కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
- క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
