[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్ని పాఠకులకు అందిస్తున్నాము.]
భారతీయ పురాణాలు విజ్ఞాన గనులు. చదువుతున్న కొద్దీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. పురాణేతిహాసాల గాథలన్నీ పెద్దల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, పండితుల ద్వారా, ప్రవచనకర్తల ద్వారా మనలో చాలామందిమి వినే ఉంటాము. మనలో కొందరు రామాయణ, భారత భాగవతాది గ్రంథాలను నిత్య పారాయణం చేస్తూనే ఉంటారు. వీటిలోని విశేషాలను మరల మరల మననం చేసుకున్నా వాటి ఆస్వాదనా గుణం తగ్గుముఖం పట్టదు.
అందుకే, భారతీయ పురాణాలు, ఇతిహాసాలపై పాఠకులకున్న అవగాహననీ, విజ్ఞానాన్ని మరోసారి వెలికితెచ్చేలా, సంచికలో, శ్రీనివాసరావు సొంసాళె గారు ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్ నిర్వహిస్తున్నారు. ఇది వారం వారం కొనసాగుతుంది.
~
ప్రశ్నలు:
- మహాభారతం ప్రకారం, ఊర్వశీ పురూరవుల రెండవ కొడుకు ఎవరు?
- బ్రహ్మాండ పురాణం ప్రకారం క్షీరసాగర మథనంలో పుట్టినవాడు, భరద్వాజుని శిష్యుడు అయిన ఆయుర్వేదాచార్యుడు ఎవరు?
- ఉత్తర రామయాణం ప్రకారం తన ప్రేయసిని బలాత్కరించాడని రావణుని శపించిన – కుబేర పుత్రుడు ఎవరు?
- భారతం ప్రకారం కాశ్యపుడు, వాశిష్ఠుడు, ప్రాణుడు, అంగీరసుడు, చ్యవనుడు అనే పంచజనుల వల్ల పుట్టిన అగ్ని పేరు?
- భవిష్య పురాణాన్ని అనుసరించి, జుహ్నుడనే బ్రాహ్మణుడి కొడుకు, తొలుత తల్లిదండ్రులను ద్వేషించి, కుక్కుట ముని ద్వారా అమ్మానాన్నల గొప్పతనాన్ని తెలుసుకుని, వారిని పూజించి, విష్ణువు ద్వారా మోక్షం పొందినవాడేవరు?
- భాగవతం ప్రకారం, బృహస్పతి తన సోదరుడు భార్య అయిన మమతను కామించి బలాత్కరించగా పుట్టినవాడెవరు?
- భాగవతం ప్రకారం, శివుడిని ప్రసన్నం చేసుకోడానికి పార్వతి ఏ పర్వతం మీద తపస్సు చేసింది?
- బ్రహ్మాండ పురాణం ప్రకారం, హేహయ వంశానికి చెందిన కార్తవీర్యార్జునుడు రాజధానిగా పాలించిన మాహిష్మతీపురం నిర్మించినదెవరు?
- భాగవతం ప్రకారం, నరనారాయణుల తల్లి, దక్షుని 13మంది కుమార్తెలలో ఒకరైన ఈమె ఎవరు?
- కంబ రామాయణం ప్రకారం, రుషభాద్రి మీదున్న ఓ ఓషధిని లక్ష్మణుని బ్రతికించేందుకు ఆంజనేయుడు తీసుకువస్తాడు. దాని పేరు?
- భారతం ప్రకారం, క్షయ రోగం సృష్టించిన దక్షుడి రోగం పేరు?
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 నవంబర్ 18వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక-34 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2025 నవంబర్ 23వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
పురాణ విజ్ఞాన ప్రహేళిక 32 జవాబులు:
1) ఛత్రకేతువు 2) సూర్యుడివి 3) జటాసురుడు 4) జితుడు 5) టిట్టిభ సరస్సు 6) తుర్వసుడు 7) త్రిపురం 8) దమనుడు 9) దేవీ పీఠాలు 10) పద్మకల్పం
పురాణ విజ్ఞాన ప్రహేళిక 32 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్
- పి.వి. రాజు, హైదరాబాద్
- రామలింగయ్య టి, తెనాలి
- శ్రేయా ఎస్. క్షీరసాగర్, దావణగెరె
- సునీతా ప్రకాష్, బెంగుళూరు
- రామవరపు గిరిజాశంకర రావు, పూణే
- వనమాల రామలింగాచారి, యాదగిరి గుట్ట
- ఆర్. బాలరాజు, ఉజ్జయిని, మధ్య ప్రదేశ్
వీరికి అభినందనలు.
గమనిక:
- పురాణ విజ్ఞాన ప్రహేళికలో ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణిస్తాము.
- ఈ క్విజ్కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు
- క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
