[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]
భారతీయ పురాణాలు విజ్ఞాన గనులు. చదువుతున్న కొద్దీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. పురాణేతిహాసాల గాథలన్నీ పెద్దల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, పండితుల ద్వారా, ప్రవచనకర్తల ద్వారా మనలో చాలామందిమి వినే ఉంటాము. మనలో కొందరు రామాయణ, భారత భాగవతాది గ్రంథాలను నిత్య పారాయణం చేస్తూనే ఉంటారు. వీటిలోని విశేషాలను మరల మరల మననం చేసుకున్నా వాటి ఆస్వాదనా గుణం తగ్గుముఖం పట్టదు.
అందుకే, భారతీయ పురాణాలు, ఇతిహాసాలపై పాఠకులకున్న అవగాహననీ, విజ్ఞానాన్ని మరోసారి వెలికితెచ్చేలా, సంచికలో, శ్రీనివాసరావు సొంసాళె గారు ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్ నిర్వహిస్తున్నారు. ఇది వారం వారం కొనసాగుతుంది.
~
ప్రశ్నలు:
- పద్మపురాణం ప్రకారం, సుందోపసుందుల సంహారానికి కారణమైన తిలోత్తమ బ్రహ్మ ద్వారా సూర్యలోకం స్థానం పొందుతుంది. తిలోత్తమ పూర్వజన్మలో ఎవరు?
- భారతం ప్రకారం, యముడు అర్జునుడికి ఇచ్చిన శంఖం పేరేమిటి? కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు శ్వేత అశ్వాన్ని అధిరోహించి ఆ శంఖాన్ని పూరిస్తాడు.
- ఆనంద రామాయణం ప్రకారం, దశరథుడు పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడు. ఆ జన్మలో ఆయన పేరేమిటి?
- మహాభారతం ప్రకారం పాండురాజు భార్య మాద్రికి అశ్వనీదేవతల వల్ల జన్మించినవాడు, ద్రౌపది వల్ల శతానీకుడు అనే పుత్రుని పొందినవాడు, మరో భార్య కరేణుక/రేణుమతి ద్వారా నిరమిత్రుడు అనే కుమారున్ని పొందినవాడు ఎవరు?
- ఋగ్వేదం ప్రకారం కణ్వుని తండ్రి అయిన మహర్షి ఎవరు?
- మనుస్మృతి ప్రకారం స్త్రీలను ఉద్దేశించి చెప్పే పదం, ఇతరుల భార్యలను, బంధువులు కాని వారిని ఇలా పిలుస్తారు.
- త్రిపురాసుర సంహారానికి వెళ్ళేటప్పుడు శివుడు పూజించిన దేవత ఎవరు?
- దేవీ భాగవతం ప్రకారం కుబేరుడి రాజధాని నగరాన్ని అలకాపురి అంటారు. దానికి గల మరో పేరు?
- బ్రహ్మాండ పురాణాన్ని అనుసరించి, పనస అనే వానరం కూతురు, సుగ్రీవుని భార్య ఎవరు?
- మార్కండేయ పురాణం ప్రకారం కుముదగిరి అనే పర్వతం రుతుమంతుడి/రుతవాక ముని శాపం వల్ల రేవతి నక్షత్రం దానిపై పడింది. ఆ పర్వాతాన్ని ఏమని పిలుస్తారు?
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 నవంబర్ 11వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక-33 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2025 నవంబర్ 16వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
పురాణ విజ్ఞాన ప్రహేళిక 31 జవాబులు:
1.అగ్ని 2. ఉపశ్రుతి 3. ఉలూకుడు 4. ఊర్ణనాభుడు 5. కట్వాటుడు/ఖట్వాటుడు 6. కశ్యప ప్రజాపతి 7. కుణీందుడు 8. కేకయ రాజు 9. గయుడు 10. గుహుడు
పురాణ విజ్ఞాన ప్రహేళిక 31 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్
- పి.వి. రాజు, హైదరాబాద్
- రామలింగయ్య టి, తెనాలి
- శ్రేయా ఎస్. క్షీరసాగర్, దావణగెరె
- సునీతా ప్రకాష్, బెంగుళూరు
- రామవరపు గిరిజాశంకర రావు, పూణే
- వనమాల రామలింగాచారి, యాదగిరి గుట్ట
- జి. స్వప్నకుమారి, హైదరాబాద్
- డి. అనూరాధ, హైదరాబాద్
- ఎస్. వికాస్ చౌదరి, నెల్లూరు
- డా. కడలి ప్రకాశరావు, విజయనగరం
వీరికి అభినందనలు.
గమనిక:
- పురాణ విజ్ఞాన ప్రహేళికలో ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణిస్తాము.
- ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
- క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
