[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్ని పాఠకులకు అందిస్తున్నాము.]
భారతీయ పురాణాలు విజ్ఞాన గనులు. చదువుతున్న కొద్దీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. పురాణేతిహాసాల గాథలన్నీ పెద్దల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, పండితుల ద్వారా, ప్రవచనకర్తల ద్వారా మనలో చాలామందిమి వినే ఉంటాము. మనలో కొందరు రామాయణ, భారత భాగవతాది గ్రంథాలను నిత్య పారాయణం చేస్తూనే ఉంటారు. వీటిలోని విశేషాలను మరల మరల మననం చేసుకున్నా వాటి ఆస్వాదనా గుణం తగ్గుముఖం పట్టదు.
అందుకే, భారతీయ పురాణాలు, ఇతిహాసాలపై పాఠకులకున్న అవగాహననీ, విజ్ఞానాన్ని మరోసారి వెలికితెచ్చేలా, సంచికలో, శ్రీనివాసరావు సొంసాళె గారు ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్ నిర్వహిస్తున్నారు. ఇది వారం వారం కొనసాగుతుంది.
~
ప్రశ్నలు:
- ఉత్తర రామాయణం ప్రకారం, ఊర్మిల లక్ష్మణుల రెండవ కుమారుడు, చంద్రమతి నగరాధిపతి ఎవరు?
- విష్ణుపురాణాన్ని అనుసరించి, జగతి, గాయత్రి, బృహతి, ఉష్ణిక్కు, త్రిష్టుప్పు, అనుష్టుప్పు, పంక్తి అనే గుర్రాలు ఎవరివి?
- భారతాన్ని అనుసరించి, అరణ్యంలో ద్రౌపదిని, పాండవుల ఆయుధాలను అపహరించాలని ప్రయత్నించి, భీముని చేతిలో మరణించిన రాక్షసుడు ఎవరు?
- బ్రహ్మవైవర్త పురాణాన్ని అనుసరించి జయవిజయుల కింకరుడు, సనకసనందాదులచే వధింపబడి, మారీచుడై జన్మించినవాడెవరు?
- కథాసరిత్సాగరం ప్రకారం, వాల్మీకి ఆశ్రమం దగ్గర ఉన్న ఏ సరస్సులో దిగి సీత తన పవిత్రతని నిరూపించుకుంది?
- భారతం ప్రకారం, దేవయాని యయాతుల రెండో కొడుకు, తన యవ్వనాన్ని తండ్రికి ఇవ్వక, తండ్రిచే, రాజ్యర్హత లేకుండా శాపానికి గురైనవాడు ఎవరు?
- భాగవతం ప్రకారం కమలాక్ష, తారకాక్ష, విద్యున్మాలి అనే రాక్షసుల కోసం మయుడు మూడు నగరాలను నిర్మించాడు. ఈ మూడింటిని కలిపి ఒకే నగరంగా శివుడు జ్వాలేశ్వర రూపంలో దహించివేశాడు. ఆ నగరం పేరేమిటి?
- స్కాంద పురాణం ప్రకారం, భరద్వాజునికి పుట్టిన కుమారుడు, గర్గుడి వలన కాశీ మహాత్మ్యాన్ని విని తపస్సు చేసి స్వర్గం పొందినదెవరు?
- సతీదేవి శరీరం ముక్కలు ముక్కలై భారతదేశంలో అనేక చోట్ల పడిన ప్రదేశాలన్నింటిని ఏమని పిలుస్తారు?
- బ్రహ్మవైవర్తపురాణం ప్రకారం, విష్ణువు నాభి లోని పద్మం నుంచి బయటకి వచ్చిన బ్రహ్మ సృజించిన తొలి కల్పం ఏది? ఇది బ్రహ్మదేవుని ఆయుర్దాయంలో మొదటి సగాన్ని సూచించే కాలమానం.
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 నవంబర్ 04వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక-32 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2025 నవంబర్ 09వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
పురాణ విజ్ఞాన ప్రహేళిక 30 జవాబులు:
1. సత్యయుగం 2. చండముండులు 3. జయద్రధుడు 4. జ్యోత్స్నాకాళి 5. దివ్యాదేవి 6. నీల 7. నైమిశారాణ్యం 8. బ్రహ్మజిత్తు 9. భృగుడు 10. మాండవి
పురాణ విజ్ఞాన ప్రహేళిక 30 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్
- పి.వి. రాజు, హైదరాబాద్
- రామలింగయ్య టి, తెనాలి
- శ్రేయా ఎస్. క్షీరసాగర్, దావణగెరె
- సునీతా ప్రకాష్, బెంగుళూరు
- రామవరపు గిరిజాశంకర రావు, పూణే
వీరికి అభినందనలు.
గమనిక:
- పురాణ విజ్ఞాన ప్రహేళికలో ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణిస్తాము.
- ఈ క్విజ్కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
- క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
