[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]
భారతీయ పురాణాలు విజ్ఞాన గనులు. చదువుతున్న కొద్దీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. పురాణేతిహాసాల గాథలన్నీ పెద్దల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, పండితుల ద్వారా, ప్రవచనకర్తల ద్వారా మనలో చాలామందిమి వినే ఉంటాము. మనలో కొందరు రామాయణ, భారత భాగవతాది గ్రంథాలను నిత్య పారాయణం చేస్తూనే ఉంటారు. వీటిలోని విశేషాలను మరల మరల మననం చేసుకున్నా వాటి ఆస్వాదనా గుణం తగ్గుముఖం పట్టదు.
అందుకే, భారతీయ పురాణాలు, ఇతిహాసాలపై పాఠకులకున్న అవగాహననీ, విజ్ఞానాన్ని మరోసారి వెలికితెచ్చేలా, సంచికలో, శ్రీనివాసరావు సొంసాళె గారు ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్ నిర్వహిస్తున్నారు. ఇది వారం వారం కొనసాగుతుంది.
~
ప్రశ్నలు:
- దేవీ భాగవతం ప్రకారం, శ్రీరామునికి మాయాసీతాను ఇచ్చిన అష్టదిక్పాలకులలో ఒకరు, పంచభూతాలలోఒకడైన వారి పేరు?
- భారతం ప్రకారం, ఉత్తర రామాయణంలోని ఏ దేవత వలన శచీదేవి, ఇంద్రుని కలుసుకున్నది?
- భారతాన్ని అనుసరించి, యుద్ధంలో సహదేవుని చేతిలో మరణించిన శకుని కుమారుడు ఎవరు?
- బ్రహ్మ సృష్టికి ప్రతిసృష్టి చేయబోయి, బ్ర్రహ్మ శాపానికి గురై సాలెపురుగుగా మారిన విశ్వకర్మ కుమారుడెవరు?
- బ్రహ్మాండపురాణాన్ని అనుసరించి, అయోధ్యా నగరాన్ని నిర్మించిన వాడు, వైవస్వత మనువు కుమారుడు, ఇక్ష్వాకుడి పూర్వీకుడు ఎవరు?
- బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం అదితి శాపం వలన నరుడై వసుదేవుడిగా జన్మించినదెవరు?
- భారతం ప్రకారం, ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్న సందర్భంలో ఒక దివ్య విమానాన్ని బహుకరించిన బ్రాహ్మణుడి పేరు?
- రామాయణం ప్రకారం, ఈ రాజుకి మృగాల భాష తెలుసు. ఒకసారి చీమల సంభాషణ విని నవ్వగా, ఎందుకు నవ్వావని భార్య అడిగితే, చెబితే తనకు మరణం సంభవిస్తుంది కాబట్టి చెప్పనంటాడు. ఆ రాజు ఎవరు?
- భాగవతం ప్రకారం, రాజర్షి అయిన ఈతని భార్య పేరు జయంతి. చిత్రరథుడు, స్వాతి, అవరోధుల తండ్రి అయిన ఈతని పేరు ఏమిటి?
- రామాయణం ప్రకారం విషాదరాజు, ఇతడి నగరం శృంగివేరపురం, శ్రీరామునికి ఆతిథ్యమిచ్చి, సీతారామలక్ష్మణులను నదిని దాటించిన వారి పేరు?
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 అక్టోబర్ 28వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక-31 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2025 నవంబర్ 02వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
పురాణ విజ్ఞాన ప్రహేళిక 29 జవాబులు:
1.మయుడు 2. వరుణుడు 3. శాంత 4. సత్యదేవి 5. సులక్షణుడు 6. అనామిక 7. ఉర్వి 8. ఓం/ఓంకారం 9. కందర్పుడు 10. కిన్నరులు
పురాణ విజ్ఞాన ప్రహేళిక 29 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్
- పి.వి. రాజు, హైదరాబాద్
- రామలింగయ్య టి, తెనాలి
- శ్రేయా ఎస్. క్షీరసాగర్, దావణగెరె
- సునీతా ప్రకాష్, బెంగుళూరు
- రామవరపు గిరిజాశంకర రావు, పూణే
- వనమాల రామలింగాచారి, యాదగిరిగుట్ట
- డా. కడలి ప్రకాశరావు, విజయనగరం
- టి. రేవతి, సంతూర్, తమిళనాడు
వీరికి అభినందనలు.
గమనిక:
- పురాణ విజ్ఞాన ప్రహేళికలో ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణిస్తాము.
- ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
- క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.