Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పురాణ విజ్ఞాన ప్రహేళిక-3

[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]

భారతీయ పురాణాలు విజ్ఞాన గనులు. చదువుతున్న కొద్దీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. పురాణేతిహాసాల గాథలన్నీ పెద్దల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, పండితుల ద్వారా, ప్రవచనకర్తల ద్వారా మనలో చాలామందిమి వినే ఉంటాము. మనలో కొందరు రామాయణ, భారత భాగవతాది గ్రంథాలను నిత్య పారాయణం చేస్తూనే ఉంటారు. వీటిలోని విశేషాలను మరల మరల మననం చేసుకున్నా వాటి ఆస్వాదనా గుణం తగ్గుముఖం పట్టదు.

అందుకే, భారతీయ పురాణాలు, ఇతిహాసాలపై పాఠకులకున్న అవగాహననీ, విజ్ఞానాన్ని మరోసారి వెలికితెచ్చేలా, సంచికలో, శ్రీనివాసరావు సొంసాళె గారు ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్ నిర్వహిస్తున్నారు. ఇది వారం వారం కొనసాగుతుంది.

~

ప్రశ్నలు:

  1. పద్మ పురాణం ప్రకారం కాశీ లోని శివుని విగ్రహానికి గల పేరు?
  2. మహాభారతం ప్రకారం, యయాతి కొడుకు తుర్వసుడి నుంచి జన్మించిన వారినమంటారు?
  3. దేవీభాగవతం ప్రకారం, శివుని కోసం తపస్సు చేసి, దేవతల్ని గెలవగల కొడుకును యిమ్మని ప్రార్ధించిన రంభుని కొడుకు పేరు?
  4. ‘రుధిరాంభసం’ అంటే ఏమిటి?
  5. బ్రాహ్మణ స్త్రీకి, వైశ్యునికి పుట్టినవాడిని ఏమని పిలుస్తారు?
  6. అహల్య, గౌతమ మహర్షిల కొడుకు పేరు?
  7. యమీ, యములలో – యముడు మరణించినప్పుడు, యమి దుఃఖాన్ని పోగొట్టడానికి దేవతలు సృష్టించినదేమి?
  8. భారతాన్ని అనుసరించి వశిష్ఠుని ఆశ్రమంలోని ఆవు ‘నందిని’ నోట్లోని నురుగు నుండి పుట్టిన వారెవరు?
  9. కధా సరిత్సాగరం ప్రకారం, నలమహారాజుకు, కర్కోటకుడి కాటు వల్ల, వికృత రూపం వస్తుంది. కర్కోటకుడు మాయా వస్త్రం ఇవ్వగా, దీన్ని కప్పుకున్నప్పుడు నలునికి స్వస్వరూపం వస్తుంది. ఆ మాయా వస్త్రం పేరేమిటి?
  10. పద్మ పురాణాన్ని అనుసరించి, పార్వతీ పరమేశ్వరుల సంగమ సమయంలో అగ్ని ప్రత్యక్షమవడంతో పార్వతి కోపించి దేవతలందరినీ వృక్షాలు కమ్మని శపిస్తుంది. అవి ఏ వృక్షాలు?

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 ఏప్రిల్ 15 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక-3 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2025 ఏప్రిల్ 20 తేదీన వెలువడతాయి.

జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

పురాణ విజ్ఞాన ప్రహేళిక 1 జవాబులు:

1.అయోముఖి 2. అలంబుసుడు 3. ఊర్జ 4. శతరూప 5. వీట 6. మేఘపుష్ప 7. విక్రమార్కుడు 8. ముండకం 9. వసంత సేన 10. సప్త మాతృకలు

పురాణ విజ్ఞాన ప్రహేళిక 1 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. పురాణ విజ్ఞాన ప్రహేళికలో ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణిస్తాము.
  2. ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  3. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version