[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్ని పాఠకులకు అందిస్తున్నాము.]
భారతీయ పురాణాలు విజ్ఞాన గనులు. చదువుతున్న కొద్దీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. పురాణేతిహాసాల గాథలన్నీ పెద్దల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, పండితుల ద్వారా, ప్రవచనకర్తల ద్వారా మనలో చాలామందిమి వినే ఉంటాము. మనలో కొందరు రామాయణ, భారత భాగవతాది గ్రంథాలను నిత్య పారాయణం చేస్తూనే ఉంటారు. వీటిలోని విశేషాలను మరల మరల మననం చేసుకున్నా వాటి ఆస్వాదనా గుణం తగ్గుముఖం పట్టదు.
అందుకే, భారతీయ పురాణాలు, ఇతిహాసాలపై పాఠకులకున్న అవగాహననీ, విజ్ఞానాన్ని మరోసారి వెలికితెచ్చేలా, సంచికలో, శ్రీనివాసరావు సొంసాళె గారు ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్ నిర్వహిస్తున్నారు. ఇది వారం వారం కొనసాగుతుంది.
~
ప్రశ్నలు:
- హరివంశం ప్రకారం భక్తి సిరియాళుని తల్లి తిరువెంగనాచి. తండ్రి ఎవరు? (క్లూ: దుర్వాసముని శాపం వల్ల తుంబురుడు అనే ప్రమథుడు మరుజన్మలో సిరియాళుడి తండ్రిగా జన్మిస్తాడు)
- స్కాందపురాణం ప్రకారం, ధారానగరాన్ని రాజధాని చేసుకుని పాలించి, తన సంస్కృత పాండిత్యముతో ‘సరస్వతీ కంఠాభరణం’, ‘శృంగార ప్రకాశిక’ రచనలు చేసి అవంతి, మాగధి అనే కొత్త రీతులను ప్రవేశపెట్టిన రాజు ఎవరు?
- మత్స్య, వాయు, బ్రహ్మాండ/భాగవత పురాణాల ప్రకారం, 46 ఏళ్ళు రాజ్యాన్ని పాలించినవాడు, మగధరాజు, నందివర్ధనుని కొడుకు శిశునాగవంశపు చివరి రాజు ఎవరు?
- తొమ్మిదవ నందుని భార్య అయిన ఈమె శూద్ర స్త్రీ. ఈవిడ కుమారుడే చంద్రగుప్తుడు. ఆమె పేరు?
- దేవీభాగవతం ప్రాకరం మధుకైటబులనే రాక్షసుల మేధస్సు నీటిలో పడి అదే ‘భూమి’ అయింది. అందువల్ల భూమికి వచ్చిన మరో పేరు?
- పద్మపురాణం ప్రకారం విటుడిపై మోజుతో కలిప్రియ అనే స్త్రీ తన భర్తని చంపి ప్రియుడితో అడవిలోకి పారిపోతుంది. అడవిలో ప్రియుడిని జంతువులు చంపడంతో ఇంటికి తిరిగివచ్చి, కార్తీక వ్రతం చేస్తున్నవారితో కలిసి ఉండడం వల్ల పాపరహితమై, ఆమె భర్త బ్రతికొస్తాడు. ఆ భర్త పేరు?
- మహాభారతం ప్రకారం నకులిని చేతిలో మరణించి కర్ణుడి కొడుకు ఎవరు?
- నలుడి శంఖం పేరు?
- మహాభారతం ప్రకారం అరిష్టాపుత్రుడైన ఓ గందర్వరాజు మరో జన్మలో ధృతరాష్ట్రుడిగా పుడతాడు. ఆ గంధర్వుడి పేరు?
- కంబ రామాయణం ప్రకారం, పూర్వం గంధర్వులు అగస్త్య మహర్షిని ఎటూ కదలకుండా చేయాలని ప్రయత్నించి, అతని శాపానికి గురై, వృక్షాలుగా మారుతారు. శ్రీరాముడి చేతిలో శాపవిమోచనం పొందిన ఆ ఐదు వటవృక్షాలను ఏమని పిలుస్తారు?
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 సెప్టెంబర్ 30వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక-27 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2025 అక్టోబర్ 05వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
పురాణ విజ్ఞాన ప్రహేళిక 25 జవాబులు:
1.రామేశ్వరం 2. చతుర్ముఖ లింగం 3. చంద్రవంశం 4. దముడు 5. నందిసేనుడు 6. పాతాళం 7. పింగళ 8. బదరికాశ్రమం 9. మార్కండేయుడు 10. శచీదేవి
పురాణ విజ్ఞాన ప్రహేళిక 25 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్
- రామలింగయ్య టి, తెనాలి
- శ్రేయా ఎస్. క్షీరసాగర్, దావణగెరె
- సునీతా ప్రకాష్, బెంగుళూరు
- రామవరపు గిరిజాశంకర రావు, పూణే
- వనమాల రామలింగాచారి, యాదగిరిగుట్ట
- కె. గాయత్రి, వరంగల్
- ఇందిర, వరంగల్
- టి. రేవతి, సంతూరు (తమిళనాడు)
- ఆర్. బాలరాజు, ఉజ్జయిని
- డా. కడలి ప్రకాశరావు, విజయనగరం
వీరికి అభినందనలు.
గమనిక:
- పురాణ విజ్ఞాన ప్రహేళికలో ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణిస్తాము.
- ఈ క్విజ్కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
- క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
