[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]
భారతీయ పురాణాలు విజ్ఞాన గనులు. చదువుతున్న కొద్దీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. పురాణేతిహాసాల గాథలన్నీ పెద్దల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, పండితుల ద్వారా, ప్రవచనకర్తల ద్వారా మనలో చాలామందిమి వినే ఉంటాము. మనలో కొందరు రామాయణ, భారత భాగవతాది గ్రంథాలను నిత్య పారాయణం చేస్తూనే ఉంటారు. వీటిలోని విశేషాలను మరల మరల మననం చేసుకున్నా వాటి ఆస్వాదనా గుణం తగ్గుముఖం పట్టదు.
అందుకే, భారతీయ పురాణాలు, ఇతిహాసాలపై పాఠకులకున్న అవగాహననీ, విజ్ఞానాన్ని మరోసారి వెలికితెచ్చేలా, సంచికలో, శ్రీనివాసరావు సొంసాళె గారు ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్ నిర్వహిస్తున్నారు. ఇది వారం వారం కొనసాగుతుంది.
~
ప్రశ్నలు:
- మత్స్య పురాణం ప్రకారం, కద్రు, కశ్యపుల సంతానమైన సర్పానికి వేయి తలలు ఉన్నాయి. ఆ సర్పం పేరేమిటి?
- అయోధ్య రాజు హరిశ్చంద్రుని మంత్రి పేరు?
- భారతం ప్రకారం ఇల్వలుడు, అగస్త్యునికిచ్చిన రథానికి కట్టే రెండు అశ్వాలలో ఒకదాని పేరు వీరవాన్. మరో గుర్రం పేరు?
- వాల్మీకి రామాయణం ప్రకారం, అదితి కశ్యపుల సంతానమైన పన్నెండు మంది పుత్రులను ఏమని పిలుస్తారు?
- ఆనంద రామాయణం ప్రకారం సౌరాష్ట్ర పట్టణంలో భిక్షువనే బ్రాహ్మణుడు, తని భార్య కలహ తో నివసిస్తుంటాడు. భర్త శాపం వల్ల ఆమె రాక్షస గర్భంలో పుడుతుంది. ఆ తరువాతి జన్మలో వారిద్దరూ ఏ పేరున జన్మించారు?
- లింగ పురాణం ప్రకారం, కాశి లోని శివలింగాన్ని దర్శించడానికి వచ్చే భక్తులను ఒక రాక్షసుడు గజరూపంలో బాధిస్తుంటే, శివుడు వాడిని చంపి వాడి చర్మాన్ని ధరించినందుకు శివునికి ఏం పేరు వచ్చింది?
- వామన పురాణాన్ని అనుసరించి, గయలో గయుడనే రాజు అశ్వమేధ, నరమేధ, మహామేధ యాగాల్ని చేసినప్పుడు విష్ణువు ద్వారపాలకునిగా గద పట్టుకుని ఉండటం వల్ల, విష్ణువుకి ఏం పేరు వచ్చింది?
- భాగవతాన్ని అనుసరించి, స్వారోచిష మనువు కాలంలో వేదశిరుడనే బ్రాహ్మణుడి భార్యకి విష్ణువు విభుడనే పేరుతో పుడతాడు. ఆమె పేరు?
- రామాయణం ప్రకారం, రావణుడు సీతను అశోకవనంలో బంధించి, తనను వరించమని బలవంత పెడుతుంటే, అక్కడ కావలి ఉన్న రాక్షస స్త్రీలలో ఒకతె, రావణుడితో, “ఇష్టం లేని దానితో ఎందుకు? నాతో రమించు” అని అంటుంది. ఆమె ఎవరు?
- రామాయణం ప్రకారం, కుంభకర్ణుడు కొడుకు కుంభుడు, నికుంభుడు ఎవరి చేతిలో మరణించారు?
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 సెప్టెంబర్ 23వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక-26 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2025 సెప్టెంబర్ 28వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
పురాణ విజ్ఞాన ప్రహేళిక 24 జవాబులు:
1.సుదర్శన చక్రం 2. జర (గృహదేవి) 3. తక్షకుడు 4. తిలోత్తమ 5. దక్షుడు 6. నలుడు 7. పర్వతేశ్వరుడు 8. బ్రహ్మకల్పం 9. భద్రుడు 10. మాతంగి
పురాణ విజ్ఞాన ప్రహేళిక 24 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్
- పి.వి.రాజు, హైదరాబాదు
- రామలింగయ్య టి, తెనాలి
- శ్రేయా ఎస్. క్షీరసాగర్, దావణగెరె
- సునీతా ప్రకాష్, బెంగుళూరు
- రామవరపు గిరిజాశంకర రావు, పూణే
- వనమాల రామలింగాచారి, యాదగిరిగుట్ట
- కె. గాయత్రి, వరంగల్
- ఇందిర, వరంగల్
- టి. రేవతి, సంతూరు (తమిళనాడు)
- ఆర్. బాలరాజు, ఉజ్జయిని
- డా. కడలి ప్రకాశరావు, విజయనగరం
వీరికి అభినందనలు.
గమనిక:
- పురాణ విజ్ఞాన ప్రహేళికలో ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణిస్తాము.
- ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
- క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.