[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]
భారతీయ పురాణాలు విజ్ఞాన గనులు. చదువుతున్న కొద్దీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. పురాణేతిహాసాల గాథలన్నీ పెద్దల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, పండితుల ద్వారా, ప్రవచనకర్తల ద్వారా మనలో చాలామందిమి వినే ఉంటాము. మనలో కొందరు రామాయణ, భారత భాగవతాది గ్రంథాలను నిత్య పారాయణం చేస్తూనే ఉంటారు. వీటిలోని విశేషాలను మరల మరల మననం చేసుకున్నా వాటి ఆస్వాదనా గుణం తగ్గుముఖం పట్టదు.
అందుకే, భారతీయ పురాణాలు, ఇతిహాసాలపై పాఠకులకున్న అవగాహననీ, విజ్ఞానాన్ని మరోసారి వెలికితెచ్చేలా, సంచికలో, శ్రీనివాసరావు సొంసాళె గారు ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్ నిర్వహిస్తున్నారు. ఇది వారం వారం కొనసాగుతుంది.
~
ప్రశ్నలు:
- బ్రహ్మపురాణం ప్రకారం, ధదీచి ఎముకలతో చేసిన విష్ణువు ఆయుధం పేరు?
- భారతం ప్రకారం, బృహద్రధుడి భార్యలు పారవేసిన అసంపూర్ణ శిశు దేహాలను కలిపి, ఆ శిశువుకు జరాసంధుడనే పేరు పెట్టిన రాక్షసి ఎవరు?
- ఉత్తర రామాయణం ప్రకారం భరతుడి పెద్ద కొడుకు, తక్షశిల పట్టణాధిపతి ఎవరు?
- సుందోపసుందులు ఒకరినొకరు పొడుచుకుని చావడానికి కారకురాలైన అప్సరస ఎవరు?
- దేవీ భాగవతం ప్రకారం, బ్రహ్మ కుడి బొటన వేలి నుంచి జన్మించిన వాడు, శివుని చేతిలో హతమై, తరువాత మేక తల తగిలించగా, బ్రతికినవాడెవరు?
- రామాయణం ప్రకారం సముద్రానికి వారధి కట్టినవాడు, విశ్వకర్మ కొడుకు ఎవరు?
- పద్మపురాణం ప్రకారం తన పిసినారితనంతో ప్రజలని బాధించి, తర్వాతి జన్మలలో కోతి, హంసగా ఆ తరువాత మనిషిగా జన్మించిన వింధ్య దేశపు రాజు ఎవరు?
- బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం, సృష్టిలో ఒక కాలం,. మధుకైటభుల మెదడు నుంచి ‘భూమి’ ఏర్పడ్డ సృష్టి కాలాన్ని ఏమంటారు?
- భాగవతం ప్రకారం కాళిందీ, కృష్ణుల కొడుకు పేరు ఏమిటి?
- వాల్మీకి రామాయణం ప్రకారం ఏనుగులకు ఆదిమాత, క్రోధవశ కూతురు ఎవరు?
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 సెప్టెంబర్ 09వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక-24 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2025 సెప్టెంబర్ 14వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
పురాణ విజ్ఞాన ప్రహేళిక 22 జవాబులు:
1) వరస్త్రీ 2) శివలింగం 3) సహస్రాక్షుడు 4) హాటకి 5) సుశ్రుతుడు 6) హిరణ్యధన్వుడు 7) సనత్కుమారులు 8) ఆనకదుందుభి 9) ఈశానుడు 10) ఇలావిద (ఇలబిల)
పురాణ విజ్ఞాన ప్రహేళిక 22 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్
- పి.వి.రాజు, హైదరాబాదు
- రామలింగయ్య టి, తెనాలి
- సునీతా ప్రకాశ్, బెంగుళూరు
- వనమాల రామలింగాచారి, యాదగిరిగుట్ట
- టి. రేవతి, సంతూరు (తమిళనాడు)
- డా. కడలి ప్రకాశరావు, విజయనగరం
వీరికి అభినందనలు.
గమనిక:
- పురాణ విజ్ఞాన ప్రహేళికలో ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణిస్తాము.
- ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
- క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.