[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్ని పాఠకులకు అందిస్తున్నాము.]
భారతీయ పురాణాలు విజ్ఞాన గనులు. చదువుతున్న కొద్దీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. పురాణేతిహాసాల గాథలన్నీ పెద్దల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, పండితుల ద్వారా, ప్రవచనకర్తల ద్వారా మనలో చాలామందిమి వినే ఉంటాము. మనలో కొందరు రామాయణ, భారత భాగవతాది గ్రంథాలను నిత్య పారాయణం చేస్తూనే ఉంటారు. వీటిలోని విశేషాలను మరల మరల మననం చేసుకున్నా వాటి ఆస్వాదనా గుణం తగ్గుముఖం పట్టదు.
అందుకే, భారతీయ పురాణాలు, ఇతిహాసాలపై పాఠకులకున్న అవగాహననీ, విజ్ఞానాన్ని మరోసారి వెలికితెచ్చేలా, సంచికలో, శ్రీనివాసరావు సొంసాళె గారు ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్ నిర్వహిస్తున్నారు. ఇది వారం వారం కొనసాగుతుంది.
~
ప్రశ్నలు:
- సముద్రజలాలను తాగి దేవతలను కాలకేయుల బారి నుండి కాపాడిన ముని ఎవరు?
- పద్మపురాణం ప్రకారం – పార్వతి రూపంలో శివుని వద్దకు వచ్చి, శివునిచే చంపబడిన అంధకాసురుడి కుమారుడెవరు?
- గరుడ, అగ్ని పురాణాల ప్రకారం – వృక్ష, లతాదులు – కశ్యపుడి భార్యలలో ఒకరైన ఈమెకు జన్మించాయి. ఈమె పేరు?
- ఏకాదశ సంకర వర్ణాల ప్రకారం బ్రాహ్మణ స్త్రీకి, క్షత్రియుడికి పుట్టినవాడిని ఏమని పిలుస్తారు?
- భారతం ప్రకారం, అవీక్షిత్తు మనుమడు, పరీక్షిత్తుని కొడుకు, ఉగ్రసేన, చిత్రసేన, ఇంద్రసేన, సుషేణ, భీమసేనల సోదరుడు ఎవరు?
- మత్స్యపురాణాన్ని అనుసరించి, జటాయువు కొడుకు ఎవరు?
- అవివాహిత కన్యలకు పుట్టినవారైన వ్యాసుడు, కర్ణుడు, శిబి చక్రవర్తి, అష్టక, ప్రతర్జన, వసుమంతులను ఏమని పిలుస్తారు?
- పురాణాలు ఎన్ని? వాటిల్లో భవిష్యపురాణం ఎన్నవది?
- బ్రహ్మ పురాణం ప్రకారం దక్షుడు తన కూతుర్ని బ్రహ్మ ఇవ్వగ, వారికి నారదుడు జన్మించాడు. ఆమె ఎవరు?
- యక్షుడైన మణిమంతుడిని – ఓ నరుడి చేతిలో మరణిస్తావని అగస్త్య ముని శపిస్తాడు. ఆ నరుడు ఎవరు?
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 సెప్టెంబర్ 02వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక-23 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2025 సెప్టెంబర్ 07వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
పురాణ విజ్ఞాన ప్రహేళిక 21 జవాబులు:
1.ఖ్యాతి 2. శరవణం 3. సాల్వుడు 4. దండకారణ్యం 5. ద్రుపదుడు 6. అంగాలమ్మ 7. ఇంద్రసేన 8. ఉశనశుడు 9. మిత్రభేదం, మిత్రలాభం, కాకోలూకీయం, లబ్ధప్రాణాశం, అపరీక్షితకారకం 10. విష్కరుడు
పురాణ విజ్ఞాన ప్రహేళిక 21 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్
- పి.వి.రాజు, హైదరాబాదు
- రామలింగయ్య టి, తెనాలి
- శ్రేయ ఎస్. క్షీరసాగర్, బెంగుళూరు
- వనమాల రామలింగాచారి, యాదగిరిగుట్ట
- టి. రేవతి, సంతూరు (తమిళనాడు)
- కె. గాయత్రి, వరంగల్
- జి. స్వప్న, హైదరాబాద్
- రామవరపు గిరిజాశంకర రావు, పూణే
వీరికి అభినందనలు.
గమనిక:
- పురాణ విజ్ఞాన ప్రహేళికలో ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణిస్తాము.
- ఈ క్విజ్కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
- క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.