[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]
భారతీయ పురాణాలు విజ్ఞాన గనులు. చదువుతున్న కొద్దీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. పురాణేతిహాసాల గాథలన్నీ పెద్దల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, పండితుల ద్వారా, ప్రవచనకర్తల ద్వారా మనలో చాలామందిమి వినే ఉంటాము. మనలో కొందరు రామాయణ, భారత భాగవతాది గ్రంథాలను నిత్య పారాయణం చేస్తూనే ఉంటారు. వీటిలోని విశేషాలను మరల మరల మననం చేసుకున్నా వాటి ఆస్వాదనా గుణం తగ్గుముఖం పట్టదు.
అందుకే, భారతీయ పురాణాలు, ఇతిహాసాలపై పాఠకులకున్న అవగాహననీ, విజ్ఞానాన్ని మరోసారి వెలికితెచ్చేలా, సంచికలో, శ్రీనివాసరావు సొంసాళె గారు ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్ నిర్వహిస్తున్నారు. ఇది వారం వారం కొనసాగుతుంది.
~
ప్రశ్నలు:
- భారతాన్ని అనుసరించి, బృహస్పతి సోదరి, ప్రభాసుడనే వసువు భార్య అయిన ఈమె సృష్టిని విస్తరింపజేస్తుంది. ఎవరీమె?
- దారుకావనంలో ఋషిపత్నుల ప్రవర్తనను చూసి ఆగ్రహించిన మునులు శివుడిని శిక్షించిన సందర్భంగా భూలోకంలో ఏది ఉద్భవించింది?
- బ్రహ్మవైవర్త పురణాం ప్రకారం, దుర్వాసుని శాపం పొంది, తృణావర్తుడనే రాక్షసునిగా జన్మించి, శ్రీకృష్ణుని తాడనంతో శాపవిమోచనం పొందిన పాండు దేశపు రాజు ఎవరు?
- భాగవతం ప్రకారం, పరమేశ్వరుడి రేతస్సు ఒక నదిగా మారింది. ఆ నది పేరు?
- మహాభారతం ప్రకారం, విశ్వామిత్రుడు కొడుకు, గాధి మనవడు శస్త్ర చికిత్సలో నిపుణుడు. ఇతను ఎవరు?
- భారతం ప్రకారం, ఏకలవ్యుడి తండ్రి, ఎరుకల రాజు ఎవరు?
- బ్రహ్మ పురాణం ప్రకారం ఎప్పుడూ కౌమారదశలోనే ఉండే నలుగురు బ్రహ్మ మానసపుత్రులు ఎవరు?
- హరివంశం ప్రకారం, వసుదేవుడు జన్మించినప్పుడు ఇతడి ఇంట్లో దుందుభులు మ్రోగినందున అతనికి ఏ పేరు వచ్చింది?
- బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం, కృష్ణుడు గోలోకంలో ఉన్నప్పుడు, అతని ఎడమకంటి నుంచి పుట్టిన భయంకరుడు, త్రినేత్రుడు, వ్యాఘ్రచర్మపరీధానుడైన వాడు పుట్టాడు. అతని పేరు?
- భాగవతం ప్రకారం కుబేరుడి తల్లి, విశ్వావసుడి భార్య ఎవరు?
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 ఆగస్టు 26 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక-22 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2025 ఆగస్టు 31వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
పురాణ విజ్ఞాన ప్రహేళిక 20 జవాబులు:
1) పర్వతుడు 2) బిందుమతి 3) మణికర్ణిక 4) ఆస్తీకుడు 5) ఊర్వశి 6) సూర్యుని గుర్రాలలో ఒకటి 7) కనకం 8) కాశ్య 9) నర్మద 10) ప్రసేనుడు
పురాణ విజ్ఞాన ప్రహేళిక 20 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్
- పి.వి.రాజు, హైదరాబాదు
- రామలింగయ్య టి, తెనాలి
- శ్రేయ ఎస్. క్షీరసాగర్, బెంగుళూరు
- వనమాల రామలింగాచారి, యాదగిరిగుట్ట
- మచ్చ గోవర్ధన్, వరంగల్
వీరికి అభినందనలు.
గమనిక:
- పురాణ విజ్ఞాన ప్రహేళికలో ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణిస్తాము.
- ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
- క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.