Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పురాణ విజ్ఞాన ప్రహేళిక-21

[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]

భారతీయ పురాణాలు విజ్ఞాన గనులు. చదువుతున్న కొద్దీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. పురాణేతిహాసాల గాథలన్నీ పెద్దల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, పండితుల ద్వారా, ప్రవచనకర్తల ద్వారా మనలో చాలామందిమి వినే ఉంటాము. మనలో కొందరు రామాయణ, భారత భాగవతాది గ్రంథాలను నిత్య పారాయణం చేస్తూనే ఉంటారు. వీటిలోని విశేషాలను మరల మరల మననం చేసుకున్నా వాటి ఆస్వాదనా గుణం తగ్గుముఖం పట్టదు.

అందుకే, భారతీయ పురాణాలు, ఇతిహాసాలపై పాఠకులకున్న అవగాహననీ, విజ్ఞానాన్ని మరోసారి వెలికితెచ్చేలా, సంచికలో, శ్రీనివాసరావు సొంసాళె గారు ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్ నిర్వహిస్తున్నారు. ఇది వారం వారం కొనసాగుతుంది.

~

ప్రశ్నలు:

  1. బ్రహ్మ సృష్టించిన ప్రజాపతులలో ఒకడైన భృగు మహర్షి భార్య పేరు?
  2. సుబ్రహ్మణేశ్వర స్వామి జన్మించిన ప్రదేశం ఏది?
  3. భాగవతం ప్రకారం, శిశుపాలుడి తమ్ముడి పేరేమిటి?
  4. ఉత్తర రామాయణం ప్రకారం, శుక్రాచార్యుని శాపం కారణంగా మధుమంతమనే నగరం మట్టిలో కలిసిపోయి, ఓ అరణ్యంగా మారుతుంది. ఆ అరణ్యం పేరు?
  5. భారతం ప్రకారం ఏ రాజు పుత్రకామేష్టి యాగం చేస్తే ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది జన్మించారు?
  6. శివుడి సేవకుడైన వీరభద్రుడి భార్య ఈమె. చేతిలో ప్రాణాలు లాగే తాడును కలిగి ఉండే ఈమె పేరు?
  7. మహాభారతం ప్రకారం నలదమయంతుల కూతురు పేరు ఏమిటి?
  8. భారతం ప్రకారం రాక్షసుల పురోహితుడు, భృగువు కుమారుడి పేరు ఏమిటి?
  9. విష్ణుశర్మ రచించిన పంచతంత్రంలోని అయిదు అధ్యాయాల పేర్లు ఏవి?
  10. భారతం లోని శాంతిపర్వం ప్రకారం ఒకప్పుడు ప్రపంచాన్నంతా పరిపాలించిన రాక్షసుడు ఎవరు? (క్లూ: గరళం సమానార్థకంతో ప్రారంభమవుతుందా పేరు)

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 ఆగస్టు 19 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక-21 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2025 ఆగస్టు 24వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

పురాణ విజ్ఞాన ప్రహేళిక 19 జవాబులు:

1.తాటక 2. త్రిలోకి తిలకం 3. దక్షసావర్ణి 4. దంతధ్వజుడు 5. దశరథుడు 6. సాతవాహనుడు 7. దేవసేన 8. ధర 9. నముచి 10. పంచజనులు

పురాణ విజ్ఞాన ప్రహేళిక 19 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. పురాణ విజ్ఞాన ప్రహేళికలో ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణిస్తాము.
  2. ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  3. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version