[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]
భారతీయ పురాణాలు విజ్ఞాన గనులు. చదువుతున్న కొద్దీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. పురాణేతిహాసాల గాథలన్నీ పెద్దల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, పండితుల ద్వారా, ప్రవచనకర్తల ద్వారా మనలో చాలామందిమి వినే ఉంటాము. మనలో కొందరు రామాయణ, భారత భాగవతాది గ్రంథాలను నిత్య పారాయణం చేస్తూనే ఉంటారు. వీటిలోని విశేషాలను మరల మరల మననం చేసుకున్నా వాటి ఆస్వాదనా గుణం తగ్గుముఖం పట్టదు.
అందుకే, భారతీయ పురాణాలు, ఇతిహాసాలపై పాఠకులకున్న అవగాహననీ, విజ్ఞానాన్ని మరోసారి వెలికితెచ్చేలా, సంచికలో, శ్రీనివాసరావు సొంసాళె గారు ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్ నిర్వహిస్తున్నారు. ఇది వారం వారం కొనసాగుతుంది.
~
ప్రశ్నలు:
- లింగ/శివ పురాణం ప్రకారం ఒక ముని, నారదుడి మేనల్లుడు ఇద్దరూ అంబరీషుడి కూతుర్ని మోహిస్తారు. ఆమెను తానే వరించాలని ఇద్దరు ఎదుటివారి ముఖం కోతి ముఖంలా మార్చమని కోరుకుంటారు. స్వయంవరంలో ఆమె విష్ణువుని వరిస్తుంది. అప్పుడు వారిద్దరూ విష్ణువుకి భార్యావియోగం కలిగేలా శాపం ఇస్తారు. ఆ ముని ఎవరు?
- దేవీ భాగవతం ప్రకారం మాంధాత భార్య పేరేమిటి?
- కాశీఖండం ప్రకారం విష్ణుమూర్తి తన చక్రంతో తవ్విన కోనేరు, శివుని కర్ణాభరణం పడిన కోనేరు ఏది?
- భారతం ప్రకారం, జనమేజయుడు చేస్తున్న సర్పయాగాన్ని మాన్పించడానికి వచ్చిందెవరు?
- అర్జునుడిని ‘పేడి’వి కమ్మని శపించిన అప్సరస ఎవరు?
- ఋగ్వేదం ప్రకారం ‘ఏతశం’ అంటే ఏమిటి?
- ఉత్తర రామాయణం ప్రకారం, అంజనాదేవి హనుమంతుడిని కన్న మహామేరువు పర్వతానికి దక్షిణాన ఉన్న పెద్ద అరణ్యం పేరు?
- భవిష్యపర్వం ప్రకారం జనమేజయుడి భార్య, చంద్రాపీడుడు, సూర్యాపీడుడుల తల్లి పేరు?
- పద్మ పురాణం ప్రకారం సూర్యుని పుత్రిక తపతి ఏ నదిగా పుట్టింది?
- భారతం ప్రకారం సాత్యకి చేతిలో మరణించిన కర్ణుడు కుమారుడు ఎవరు?
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 ఆగస్టు 12 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక-20 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2025 ఆగస్టు 17వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
పురాణ విజ్ఞాన ప్రహేళిక 18 జవాబులు:
1) దేవకి, వసుదేవులు 2) కన్యకాంబ 3) క్షుతుడు 4) గద 5) ఘోషమణి 6) చతురంగుడు 7) కాలభైరవుడు 8) సైంధవుడు 9) ఝర్ఝుడు 10) తక్షుడు
పురాణ విజ్ఞాన ప్రహేళిక 18 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్
- పి.వి.రాజు, హైదరాబాదు
- సునీతా ప్రకాష్, బెంగుళూరు
- రామలింగయ్య టి, తెనాలి
- శ్రేయ ఎస్. క్షీరసాగర్, బెంగుళూరు
వీరికి అభినందనలు.
గమనిక:
- పురాణ విజ్ఞాన ప్రహేళికలో ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణిస్తాము.
- ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
- క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.