[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్ని పాఠకులకు అందిస్తున్నాము.]
భారతీయ పురాణాలు విజ్ఞాన గనులు. చదువుతున్న కొద్దీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. పురాణేతిహాసాల గాథలన్నీ పెద్దల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, పండితుల ద్వారా, ప్రవచనకర్తల ద్వారా మనలో చాలామందిమి వినే ఉంటాము. మనలో కొందరు రామాయణ, భారత భాగవతాది గ్రంథాలను నిత్య పారాయణం చేస్తూనే ఉంటారు. వీటిలోని విశేషాలను మరల మరల మననం చేసుకున్నా వాటి ఆస్వాదనా గుణం తగ్గుముఖం పట్టదు.
అందుకే, భారతీయ పురాణాలు, ఇతిహాసాలపై పాఠకులకున్న అవగాహననీ, విజ్ఞానాన్ని మరోసారి వెలికితెచ్చేలా, సంచికలో, శ్రీనివాసరావు సొంసాళె గారు ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్ నిర్వహిస్తున్నారు. ఇది వారం వారం కొనసాగుతుంది.
~
ప్రశ్నలు:
- మహాభారతంలోని అరణ్యపర్వం ద్వితీయాశ్వాసం ప్రకారం, కురుక్షేత్రం వద్ద గల ఏ తీర్థంలో స్నానం చేస్తే వెయ్యి గోదానాల ఫలం లభిస్తుంది? (క్లూ: ఈ తీర్థం పేరుతోనే హనుమంతుడి శ్లోకం ఒకటి మొదలవుతుంది)
- భృగు మహర్షి, పులస్త్య, పులహ, క్రతు, ఆంగీర, మరీచి, దక్ష, అత్రి, వశిష్ఠులను ఏమని పిలుస్తారు?
- కృతయుగానికి గల మరో పేరు?
- బకాసురుని సోదరుడెవరు?
- మారీచుని తండ్రి పేరు?
- విష్ణువు నీటిపై శయనించినప్పుడు, అతని చెవుల నుండి పుట్టిన దెవరు?
- మహాభారతంలోని ప్రతివింధ్యుడు, శ్రుతసోముడు, శ్రుతకర్ముడు, శతానీకుడు, శ్రుతసేనుడు ఎవరు?
- పద్నాలుగు వేల యోజనాల వైశాల్యం కలిగి, మేరు పర్వతంపై ఉన్న బ్రహ్మ నివాస స్థలం పేరు?
- కుబేరుడి కుమారుడైన నలకూబరుడి తమ్ముడి పేరు?
- ఇంద్రుని వజ్రాయుధం, సుదర్శన చక్రం ఇతని శరీరానికి తాకి బూడిదైన హిరణ్యకశపుని పెద్ద కొడుకు పేరు (మహాభారతం లోని అనుశాసనిక పర్వం ప్రకారం)?
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 ఏప్రిల్ 08 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక-2 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2025 ఏప్రిల్ 13 తేదీన వెలువడతాయి.
జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
గమనిక:
- పురాణ విజ్ఞాన ప్రహేళికలో ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణిస్తాము.
- ఈ క్విజ్కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
- క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.