[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]
భారతీయ పురాణాలు విజ్ఞాన గనులు. చదువుతున్న కొద్దీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. పురాణేతిహాసాల గాథలన్నీ పెద్దల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, పండితుల ద్వారా, ప్రవచనకర్తల ద్వారా మనలో చాలామందిమి వినే ఉంటాము. మనలో కొందరు రామాయణ, భారత భాగవతాది గ్రంథాలను నిత్య పారాయణం చేస్తూనే ఉంటారు. వీటిలోని విశేషాలను మరల మరల మననం చేసుకున్నా వాటి ఆస్వాదనా గుణం తగ్గుముఖం పట్టదు.
అందుకే, భారతీయ పురాణాలు, ఇతిహాసాలపై పాఠకులకున్న అవగాహననీ, విజ్ఞానాన్ని మరోసారి వెలికితెచ్చేలా, సంచికలో, శ్రీనివాసరావు సొంసాళె గారు ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్ నిర్వహిస్తున్నారు. ఇది వారం వారం కొనసాగుతుంది.
~
ప్రశ్నలు:
- కంబ రామాయణం ప్రకారం ఆమె సుకేతుని కుమార్తె, సుందుని భార్య. వెయ్యి ఏనుగుల బలం బ్రహ్మ నుంచి వరంగా పొందింది. శ్రీరాముని చేతిలో మరణించి శాపవిమోచనం పొందింది. ఆమె ఎవరు?
- దేవి భాగవతాన్ని అనుసరించి, ఒక యోగీశ్వరి మంత్రాన్ని రోజూ నూటొక్కసార్లు జపిస్తే, సర్వజ్ఞులై, ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగురుతూ వెళ్ళవచ్చని చెప్పిన మంత్రం?
- మార్కండేయ పురాణం ప్రకారం, తొమ్మిదవ మనువు, మన్వంతరంలో కుమారస్వామి అద్భుతుడనే పేరుతోఇంద్రుడైన వారి పేరు?
- వామన పురాణాన్ని అనుసరించి, ఇతను తామసుడనే మనువు కుమారుడు. ఒకసారి పిల్లల కోసం రక్తమాంసాలతో హోమం చేశాడు. ఫలితం లభించకపోవడంతో తన శరీరాన్ని కూడా అర్పించగా, అతడికి ఏడుగురు పిల్లలు పుడతారు. వీళ్ళనే మరుత్తులంటారు. తామస మన్వంతరంలో వీళ్ళే మనువులు. ఆయన పేరేమిటి?
- రామాయణం ప్రకారం, ఈయన అజుడి కుమారుడు. అసలు పేరు ‘నేమి’. ఈయన ఎవరు?
- కథాసరిత్సాగరం ప్రకారం, గుణాఢ్యుడి బృహత్కథలోని ఒక పాత్ర. రాజు భార్య శక్తిమతి పాము కాటు వల్ల మరణించగా, అతడు బ్రహ్మచర్యం అవలంబిస్తే, శివుడు అతని కలలో కనబడి, “నీవు వేటకు వెళ్ళినప్పుడు ఒక బాలుడు సింహం మీద కన్పిస్తాడు. అతడిని నీ కొడుకుగా స్వీకరించు” అని చెప్తాడు. ఆ బాలుడి పేరు?
- భారతం ప్రకారం, అరిష్టనేమి ఇద్దరు కూతుళ్ళు విహరిస్తూ ఉంటే కేశి అనేవాడు బలవంతంగా ఎత్తుకుపోగా ఇంద్రుడు ఆ ఇద్దరిని రక్షించి పెంచి పెద్ద జేసి, పెద్ద కూతురిని కుమారస్వామికిచ్చి వివాహం చేస్తాడు. ఆమె పేరు?
- బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం ద్రోణుడు (ద్రోణాచార్యుడు కాదు) తన పత్నితో విష్ణుమూర్తి కోసం తపస్సు చేసి, ఎంతకూ ప్రత్యక్షం కాకపోవడంతో అగ్నిప్రవేశం చేస్తాడు. తర్వాతి జన్మలో వారిద్దరు యశోద, నందుడిలా పుడతారు. ద్రోణుడి భార్య పేరు?
- భారతం ప్రకారం ఇతను దనువు, కశ్యపుల కొడుకు. వీరి కోడలు ప్రభ. ఇంద్రుడు ఇతన్ని నురుగుతో చంపుతాడు. ఎవరితను?
- ఋగ్వేదం ప్రకారం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులకు నిషాదులను కలిపి ఏమని పిలుస్తారు?
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 ఆగస్టు 05 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక-19 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2025 ఆగస్టు 10వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
పురాణ విజ్ఞాన ప్రహేళిక 17 జవాబులు:
1.శీలవతి 2. సింహిక 3. సుదేవుడు 4. హయహయుడు 5. వృద్ధిక 6. ఉతథ్యుడు 7. కర్ణప్రావరుణులు 8. గండకీ నది 9. దేవిక 10. స్వాహాదేవి
పురాణ విజ్ఞాన ప్రహేళిక 17 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్
- పి.వి.రాజు, హైదరాబాదు
- సునీతా ప్రకాష్, బెంగుళూరు
- రామలింగయ్య టి, తెనాలి
- శ్రేయ ఎస్. క్షీరసాగర్, బెంగుళూరు
- కె. గాయత్రి, వరంగల్
- వనమాల రామలింగాచారి, యాదగిరిగుట్ట
వీరికి అభినందనలు.
గమనిక:
- పురాణ విజ్ఞాన ప్రహేళికలో ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణిస్తాము.
- ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
- క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.