Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పురాణ విజ్ఞాన ప్రహేళిక-18

[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]

భారతీయ పురాణాలు విజ్ఞాన గనులు. చదువుతున్న కొద్దీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. పురాణేతిహాసాల గాథలన్నీ పెద్దల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, పండితుల ద్వారా, ప్రవచనకర్తల ద్వారా మనలో చాలామందిమి వినే ఉంటాము. మనలో కొందరు రామాయణ, భారత భాగవతాది గ్రంథాలను నిత్య పారాయణం చేస్తూనే ఉంటారు. వీటిలోని విశేషాలను మరల మరల మననం చేసుకున్నా వాటి ఆస్వాదనా గుణం తగ్గుముఖం పట్టదు.

అందుకే, భారతీయ పురాణాలు, ఇతిహాసాలపై పాఠకులకున్న అవగాహననీ, విజ్ఞానాన్ని మరోసారి వెలికితెచ్చేలా, సంచికలో, శ్రీనివాసరావు సొంసాళె గారు ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్ నిర్వహిస్తున్నారు. ఇది వారం వారం కొనసాగుతుంది.

~

ప్రశ్నలు:

  1. దేవీ భాగవతం ప్రకారం, అదితి కశ్యపులు – వరుణుని శాపం వల్ల భూలోకంలో ద్వాపర యుగంలో ఏ పేరున జన్మించారు?
  2. కుసుమ శ్రేష్టి, కుసుమాంబల కుమార్తె, విష్ణువర్దనుడనే రాజు తనను కోరి, తమపై యుద్ధానికి రాగా, అగ్నిప్రవేశం చేసి తనువు చాలించి, వైశ్యుల కులదేవతగా వెలసిన ఆమె ఎవరు?
  3. మహాభారతం ప్రకారం, బ్రహ్మ తుమ్మడంతో, అతని గర్భం నుండి పుట్టి, బ్రహ్మ చేసే యజ్ఞానికి రుత్విజుడైన వాడు ఎవరు?
  4. విష్ణువు చేతిలో మరణించిన దితి కశ్యపుల కుమారుడు గదుడి ఎముకతో విశ్వకర్మ తయారు చేసిన ఆయుధం ఏది?
  5. మహాభారతం ప్రకారం నకులుడి శంఖం పేరేమిటి?
  6. పద్మపురాణం ప్రకారం, దశరథ మహారాజు కుమార్తె శాంత, అల్లుడు ఋష్యశృంగుల కుమారుడెవరు?
  7. భాగవతం ప్రకారం అమృతాన్ని దేవతలకివ్వాలని విష్ణువు ధరించిన రూపం ‘మోహిని’ని చూసి ఆకర్షితుడై శివుడు ఆమెతో రమిస్తాడు. ఈ జగన్మోహినికి పట్టిన చెమటే గండకీనది. వీరికి పుట్టినదెవరు?
  8. పాంచాలిని మోహించి బలవంతంగా ఎత్తుకుపోతే, పాండవులు అవమానించి పంపగా, శివుడిని ప్రార్థించి, అర్జునుడిని తప్ప మిగిలిన నలుగురుని ఓడించేడట్లు వరం పొందిన సింధుదేశపు రాజు ఎవరు?
  9. వామన పురాణం ప్రకారం, మారీచుని తండ్రి సుందుడనే రాక్షసుడు. సుందుని తండ్రి ఎవరు?
  10. రామాయణం ప్రకారం రాముని సోదరుడైన భరతుని కొడుకు ఎవరు? గంధర్వ, శైలూషులని చంపి భరతుడు ఇతనికి పట్టం కడతాడు. ఇతడి పట్టణం తక్షశిల.

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 జూలై 29 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక-18 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2025 ఆగస్టు 03 తేదీన వెలువడతాయి.

జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

పురాణ విజ్ఞాన ప్రహేళిక 16 జవాబులు:

1) హ్రదోదరుడు 2) స్వరోచి 3) సుహోత్రుడు 4) శుభదత్తుడు 5) వీరణి 6) మంథర 7) భల్లాణుడు 8) బాలయోగి 9) పద్మావతి 10) నారదుడు

పురాణ విజ్ఞాన ప్రహేళిక 16 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. పురాణ విజ్ఞాన ప్రహేళికలో ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణిస్తాము.
  2. ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  3. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version