Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పురాణ విజ్ఞాన ప్రహేళిక-17

[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]

భారతీయ పురాణాలు విజ్ఞాన గనులు. చదువుతున్న కొద్దీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. పురాణేతిహాసాల గాథలన్నీ పెద్దల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, పండితుల ద్వారా, ప్రవచనకర్తల ద్వారా మనలో చాలామందిమి వినే ఉంటాము. మనలో కొందరు రామాయణ, భారత భాగవతాది గ్రంథాలను నిత్య పారాయణం చేస్తూనే ఉంటారు. వీటిలోని విశేషాలను మరల మరల మననం చేసుకున్నా వాటి ఆస్వాదనా గుణం తగ్గుముఖం పట్టదు.

అందుకే, భారతీయ పురాణాలు, ఇతిహాసాలపై పాఠకులకున్న అవగాహననీ, విజ్ఞానాన్ని మరోసారి వెలికితెచ్చేలా, సంచికలో, శ్రీనివాసరావు సొంసాళె గారు ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్ నిర్వహిస్తున్నారు. ఇది వారం వారం కొనసాగుతుంది.

~

ప్రశ్నలు:

  1. విక్రమాంకదేవ చరిత్రం ప్రకారం విష్ణుశర్మ కూతురు, చంద్రగుప్తుడి భార్య, వరరుచి తల్లి అయిన ఆమె పేరేమిటి?
  2. విష్ణుపురాణాన్ని అనుసరించి దితి, కశ్యపులకు – హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, ఒక కూతురు జన్మిస్తారు. ఈమె భర్త విప్రచిత్తి. కొడుకులు రాహుకేతువులు. ఆమె ఎవరు?
  3. భారతాన్ని అనుసరించి విదర్భ రాజైన భీముడు, తనకి ప్రీతిపాత్రుడైన ఏ బ్రాహ్మణుని తన కూతురు దమయంతిని వెతకడానికి పంపిస్తాడు?
  4. దేవీభాగవతం ప్రకారం లక్ష్మి, విష్ణుమూర్తి అశ్వరూపాలలో ఉండి సంభోగించినప్పుడు పుట్టినవాడు, తుర్వసుడి ఆశ్రమంలో విడిచిపెట్టబడినవాడు ఎవరు?
  5. భారతం ప్రకారం చెట్లపై పడిన శివుడి రేతస్సు నుంచి జన్మించిన ఒక రకం ప్రేతం, పిల్లలు కావాలనుకునేవారు పూజించే ఆమె ఎవరు?
  6. భారతాన్ని అనుసరించి ఇతను బృహస్పతి సోదరుడు. ఇతని భార్య మమతతో బృహస్పతి రమిస్తాడు. బృహస్పతి ఈ సోదరుడి పేరు?
  7. భారతం ప్రకారం, దక్షిణ సముద్ర తీరంలో నివసించే ఒక తెగ ప్రజలకు చెవులు చాలా పెద్దవి. పాదాల దాకా వేలాడుతుంటాయి. సహదేవుడు ఈ ప్రదేశాన్ని జయిస్తాడు. ఈ తెగ ప్రజల పేరు?
  8. స్కాంద పురాణం ప్రకారం, విష్ణువు మోహిని రూపాన్ని చూసి శివుడు మోహించి, ఆలింగన మాధుర్యాన్ని చవిచూస్తే, ఒక నది పుట్టింది. గంగానదిలో కలిసే ఆ నది పేరు?
  9. భారతం ప్రకారం, ధర్మరాజుని స్వయంవరంలో వివాహమాడిన శివి దేశపు రాజు గోవాసనుడి కుమార్తె ఎవరు?
  10. జైమినీ భారతం ప్రకారం, మాహిష్మతీ పురాధిపతి పెద్ద భార్య జ్వాలకు పుట్టిన కూతురు అగ్నిదేవుని వరిస్తుంది. ఆమె పేరు?

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 జూలై 22 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక-17 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2025 జూలై 27 తేదీన వెలువడతాయి.

జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

పురాణ విజ్ఞాన ప్రహేళిక 15 జవాబులు:

1.ప్రభాసం 2. బదరిపాచం 3. బాణాసురుడు 4. మణిచరుడు 5. రుక్ముడు 6. రుక్షవిరజుడు 7. విదురుడు 8. విష్ణుపంజరం 9. శరవిందుడు/శశబిందుడు 10. శుష్కుడు

పురాణ విజ్ఞాన ప్రహేళిక 15 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. పురాణ విజ్ఞాన ప్రహేళికలో ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణిస్తాము.
  2. ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  3. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version