Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పురాణ విజ్ఞాన ప్రహేళిక-16

[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]

భారతీయ పురాణాలు విజ్ఞాన గనులు. చదువుతున్న కొద్దీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. పురాణేతిహాసాల గాథలన్నీ పెద్దల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, పండితుల ద్వారా, ప్రవచనకర్తల ద్వారా మనలో చాలామందిమి వినే ఉంటాము. మనలో కొందరు రామాయణ, భారత భాగవతాది గ్రంథాలను నిత్య పారాయణం చేస్తూనే ఉంటారు. వీటిలోని విశేషాలను మరల మరల మననం చేసుకున్నా వాటి ఆస్వాదనా గుణం తగ్గుముఖం పట్టదు.

అందుకే, భారతీయ పురాణాలు, ఇతిహాసాలపై పాఠకులకున్న అవగాహననీ, విజ్ఞానాన్ని మరోసారి వెలికితెచ్చేలా, సంచికలో, శ్రీనివాసరావు సొంసాళె గారు ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్ నిర్వహిస్తున్నారు. ఇది వారం వారం కొనసాగుతుంది.

~

ప్రశ్నలు:

  1. మహాభారతం ప్రకారం దేవాసురులకు జరిగిన యుద్ధంలో సుబ్రహ్మణ్యస్వామి చేతిలో మరణించిన రాక్షసుడు ఎవరు?
  2. మార్కండేయ పురాణం ప్రకారం వరూధినికి, ప్రవరాఖ్యుడి రూపంలో వచ్చిన గంధర్వుడి వల్ల పుట్తిన కొడుకు ఎవరు?
  3. భారతం ప్రకారం భుమన్యుని కొడుకు, ఇతని భార్య సువర్ణ. హస్తినాపురం నిర్మించిన హస్తి ఇతడి కొడుకే. ఇతడి రాజ్యంలో బంగారు చేపలతో వర్షం కురుస్తుండేదట. ఎవరా రాజు?
  4. కథాసరిత్సాగరం ప్రకారం పాటలీపుత్రంలో ఒక కట్టెలు కొట్టేవాడు – యక్షుల సేవ చేసి వారి ద్వారా ఒక అక్షయపాత్ర పొంది, సంపన్నుడవుతాడు. ఆ పాత్ర పగిలిపోయాకా, తిరిగి కట్టెలుకొట్టేవాడిలా మారిపోతాడు. ఆ యువకుడి పేరేమిటి?
  5. దేవీ భాగవతం ప్రకారం బ్రహ్మ ఎడమ బొటనవేలి నుండి పుట్టిన కూతురు, ఆమె భర్త పేరు దక్షుడు. ఆమె పేరేమిటి?
  6. రామాయణం ప్రకారం, పూర్వజన్మలో ఆమె దుందుభి అనే గంధర్వ స్త్రీ. ఈ జన్మలో కైకేయితో, రాముడిని అరణ్యాలకు పంపేలా చేసింది. ఎవరామె?
  7. సింధు, కటక దేశాల రాజు చేస్తున్న ‘ఇష్టాదానవ్రతాన్ని’ పరీక్షింపదలచి శివుడు అతని ఇంటికి అతిథిగా వెళ్ళి, తనకు వేశ్యనిమ్మంటాడు. కానీ అతని రాజ్యంలో వేశ్యలే లేరు. చివరకు శివునికి తన భార్యనే పంపిన ఆ రాజు పేరు?
  8. అగ్నిపురాణం ప్రకారం అంగదేశపు రాజు, బలి చక్రవర్తి కొడుకు ఎవరు?
  9. లింగ పురాణం ప్రకారం విష్ణుమూర్తి వరం వలన ఈమెకు ‘అంబరీషుడు’ జన్మించాడు. ఎవరామె?
  10. బ్రహ్మవైవర్త పురాణాన్ని అనుసరించి, బ్రహ్మ కంఠం నుండి పుట్టినవాడి పేరు?

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 జూలై 15 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక-16 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2025 జూలై 20 తేదీన వెలువడతాయి.

జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

పురాణ విజ్ఞాన ప్రహేళిక 14 జవాబులు:

1) సప్తనాగులు 2) సాలగ్రామం 3) ఆరాళికుడు 4) ఉ 5) సృగాల వాసుదేవుడు 6) ఆదిత్య హృదయం 7) కపాలి 8) గోమతి/కౌశికి 9) దేవి 10) పౌరుషేయుడు

పురాణ విజ్ఞాన ప్రహేళిక 14 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. పురాణ విజ్ఞాన ప్రహేళికలో ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణిస్తాము.
  2. ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  3. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version