Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పురాణ విజ్ఞాన ప్రహేళిక-14

[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]

భారతీయ పురాణాలు విజ్ఞాన గనులు. చదువుతున్న కొద్దీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. పురాణేతిహాసాల గాథలన్నీ పెద్దల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, పండితుల ద్వారా, ప్రవచనకర్తల ద్వారా మనలో చాలామందిమి వినే ఉంటాము. మనలో కొందరు రామాయణ, భారత భాగవతాది గ్రంథాలను నిత్య పారాయణం చేస్తూనే ఉంటారు. వీటిలోని విశేషాలను మరల మరల మననం చేసుకున్నా వాటి ఆస్వాదనా గుణం తగ్గుముఖం పట్టదు.

అందుకే, భారతీయ పురాణాలు, ఇతిహాసాలపై పాఠకులకున్న అవగాహననీ, విజ్ఞానాన్ని మరోసారి వెలికితెచ్చేలా, సంచికలో, శ్రీనివాసరావు సొంసాళె గారు ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్ నిర్వహిస్తున్నారు. ఇది వారం వారం కొనసాగుతుంది.

~

ప్రశ్నలు:

  1. అగ్నిపురాణం ప్రకారం అనంత, తక్షక, కర్క, పద్మ, మహాపద్మ, శంఖిక, గులికలను ఏమని పిలుస్తారు?
  2. శివ పురాణం ప్రకారం, శంఖచూడుడి రూపంలో వచ్చిన విష్ణువు తులసిని మాయచేసి ఆమెతో రమించంగా, తులసి విష్ణువుని రాయివి కమ్మని శపిస్తుంది. శివుడు వచ్చి తులసి గండకీనదిగా మారుతుందనీ, విష్ణువు గండకీ నదీతీరంలో రాయిగా అవుతాడని చెప్తాడు. ఆ రాయి పేరు?
  3. భారతాన్ని అనుసరించి, మదమెక్కిన ఏనుగులను నియంత్రించే మావటివాడి పేరు?
  4. అగ్నిపురాణాన్ని అనుసరించి శివునిలా అర్థం వచ్చే పదం ఏది?
  5. హరివంశం ప్రకారం జరాసంధుడు మరియు జరాసంధుడి స్నేహితుడూ, ఇద్దరూ కృష్ణుడిని ఎదిరించగా, కృష్ణుడి చేతిలో మరణించిన అతని స్నేహితుడి పేరు?
  6. వాల్మీకి రామాయణం ప్రకారం, రావణుని వధ నిమిత్తం అగస్త్య మహాముని రాముడికి ఉపదేశించిన స్తోత్రం ఏది?
  7. శివ/బ్రహ్మ పురాణాలను అనుసరించి, త్రిలోకాధిపత్యం ఎవరిదనే విషయం మీద బ్రహ్మ విష్ణువులకు వివాదం జరుగుతున్నప్పు, వారి మధ్య శివుడు ఆవిర్భవిస్తాడు. బ్రహ్మ ఆ సందర్భంలో శివలింగం పైభాగాన్ని చూశానని అబద్ధం చెప్పగా, శివుడు బ్రహ్మ తలను నరికేస్తాడు. అప్పుడు బ్రహ్మ శివుడిని – కపాలంలో అడుక్కు తినమని శపిస్తాడు. అందుకే శివుడు పేరు ____ అయింది.
  8. వాల్మీకి రామాయణం ప్రకారం, విశ్వామిత్రుని సోదరి, భర్త రుచికుడి శాపం వల్ల దేవతగా, ప్రజలు ఆరాధించే నదిగా మారుతుంది. ఆ నది పేరు?
  9. దేవీభాగవతం ప్రకారం ఈమె ఆవిర్భావం త్రిమూర్తులకు తెలియదు. అనంత భక్తి స్వరూపిణి, ఈమె పంచశక్తులుగా దుర్గ, లక్ష్మి, సరస్వతి, సావిత్రి, రాధలుగా అవతరించింది. ఈమె పేరు?
  10. భాగవతం ప్రకారం, జ్యేష్ఠ మాసంలో సూర్యుడితో పాటు ప్రయాణించే రాక్షసుడి పేరు?

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 జూలై 01 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక-14 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2025 జూలై 06 తేదీన వెలువడతాయి.

జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

పురాణ విజ్ఞాన ప్రహేళిక 12 జవాబులు:

1) తారకాసురుడు 2) త్రైవర్ణికులు 3) దత్తాత్రేయుడు 4) దేవనది 5) నహుషుడు 6) పుష్పకం 7) అధూర్త రజసుడు 8) బిందుమతి 9) మయూరుడు 10) మహాపద్మావతి

పురాణ విజ్ఞాన ప్రహేళిక 11 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. పురాణ విజ్ఞాన ప్రహేళికలో ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణిస్తాము.
  2. ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  3. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version