Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పురాణ విజ్ఞాన ప్రహేళిక-13

[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]

భారతీయ పురాణాలు విజ్ఞాన గనులు. చదువుతున్న కొద్దీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. పురాణేతిహాసాల గాథలన్నీ పెద్దల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, పండితుల ద్వారా, ప్రవచనకర్తల ద్వారా మనలో చాలామందిమి వినే ఉంటాము. మనలో కొందరు రామాయణ, భారత భాగవతాది గ్రంథాలను నిత్య పారాయణం చేస్తూనే ఉంటారు. వీటిలోని విశేషాలను మరల మరల మననం చేసుకున్నా వాటి ఆస్వాదనా గుణం తగ్గుముఖం పట్టదు.

అందుకే, భారతీయ పురాణాలు, ఇతిహాసాలపై పాఠకులకున్న అవగాహననీ, విజ్ఞానాన్ని మరోసారి వెలికితెచ్చేలా, సంచికలో, శ్రీనివాసరావు సొంసాళె గారు ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్ నిర్వహిస్తున్నారు. ఇది వారం వారం కొనసాగుతుంది.

~

ప్రశ్నలు:

  1. అగ్నిపురాణాన్ని అనుసరించి, దశరథుని బాణాఘానికి మరణించిన బ్రాహ్మణ బాలుడెవరు?
  2. ఒక ముని అనుగ్రహం పొందిన ద్రుపదుడికి అగ్నికుండంలో దృష్టద్యుమ్నుడు అనే కొడుకు, కృష్ణ అనే కూతురు పుట్టారు. ఆ ముని ఎవరు?
  3. బ్రహ్మాండ పురాణం ప్రకారం క్రోధ, కశ్యపుల కూతురిని పులహుడికిచ్చి వివాహం చేయగా, వీరికి వానర, కిన్నెర, కింపురుషులు పుట్టారు. ఆమె పేరు?
  4. భాగవతాన్ని అనుసరించి, శ్రీకృష్ణుడి తండ్రియైన వసుదేవుని తోబుట్టువు, ఆమె భర్త జయత్సేనుడి కుమార్తె అయిన మిత్రవిందను శ్రీకృష్ణుడు వివాహం చేసుకుంటాడు. కృష్ణుని మేనత్త పేరేమిటి?
  5. రామాయణం ప్రకారం, బ్రాహ్మణ శాపం వల్ల దశరథ మహారాజు దేశంలో కరువు వస్తే, దశరథుని స్నేహితుడు – ధర్మరథుని కొడుకైన ఋష్యశృంగుడిని రప్పించి, దశరథుని కుమార్తె శాంతనిచ్చి, వివాహం చేస్తాడు. వీరికి చతురంగుడు అనే కొడుకు పుడతాడు. రాజ్యంలో కాటకం పోతుంది. దశరథుని స్నేహితుడు పేరేమిటి?
  6. భాగవతం ప్రకారం, యమునాతీరంలో ఉన్న రామకృష్ణులను చంపడానికి లేగదూడ రూపంలో వచ్చి, కృష్ణుని చేతిలో మరణించిన రాక్షసుడెవరు?
  7. పద్మపురాణం ప్రకారం ఊర్వశి, పురూరవుల కొడుకు ఎవరు?
  8. మత్స్యపురాణాన్ని అనుసరించి, బ్రహ్మ మనసు నుంచి సగం స్త్రీ రూపంగా, సగం పురుష రూపంగా పుట్టిన శక్తి పేర్రు?
  9. దేవీభాగవతాన్ని అనుసరించి, అప్సరస ఘృతాచిని చూసి వ్యాసుడికి రేతఃపతనం జరుగగా, పుట్టిన వ్యాసుడి కుమారుడు ఎవరు?
  10. భారతం ప్రకారం శ్రీకృష్ణుని భార్య, సత్రాజిత్తు కుమార్తె అయిన సత్యభామ పూర్వజన్మ నామం ఏది?

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 జూన్ 24 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక-13 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2025 జూన్ 29 తేదీన వెలువడతాయి.

జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

పురాణ విజ్ఞాన ప్రహేళిక 11 జవాబులు:

1.సుదర్శనుడు 2. అగ్నిజ్యోతనుడు 3. అంజన పర్వుడు 4. కల్పకం 5. కావ్యమాత 6. కుమారిక 7. చిత్రరేఖ 8. చింతామణి 9. చెంబు 10. ఛాయాగ్రహి/సింహిక

పురాణ విజ్ఞాన ప్రహేళిక 11 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. పురాణ విజ్ఞాన ప్రహేళికలో ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణిస్తాము.
  2. ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  3. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version