[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]
భారతీయ పురాణాలు విజ్ఞాన గనులు. చదువుతున్న కొద్దీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. పురాణేతిహాసాల గాథలన్నీ పెద్దల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, పండితుల ద్వారా, ప్రవచనకర్తల ద్వారా మనలో చాలామందిమి వినే ఉంటాము. మనలో కొందరు రామాయణ, భారత భాగవతాది గ్రంథాలను నిత్య పారాయణం చేస్తూనే ఉంటారు. వీటిలోని విశేషాలను మరల మరల మననం చేసుకున్నా వాటి ఆస్వాదనా గుణం తగ్గుముఖం పట్టదు.
అందుకే, భారతీయ పురాణాలు, ఇతిహాసాలపై పాఠకులకున్న అవగాహననీ, విజ్ఞానాన్ని మరోసారి వెలికితెచ్చేలా, సంచికలో, శ్రీనివాసరావు సొంసాళె గారు ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్ నిర్వహిస్తున్నారు. ఇది వారం వారం కొనసాగుతుంది.
~
ప్రశ్నలు:
- ఒక రాక్షసరాజు శివుడి కొడుకు వల్ల తప్ప తనకు మరణం ఉండకూడదని శివుని దగ్గర వరం పొందుతాడు. సుబ్రహ్మణ్యస్వామి శివుని కొడుకుగా జన్మించి, వధించిన ఆ రాక్షసుడెవరు?
- బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల్ని కలిపి పిలిచేటప్పుడు వారిని ఏమంటారు?
- బ్రహ్మపురణాన్ని అనుసరించి అత్రి, అనసూయల కుమారుడు, మహావిష్ణువు అవతారం. కార్తవీర్యార్జునుడు ఇతని కోసం తపస్సు చేసి వెయ్యి చేతులు, నిత్య యవ్వనం వరాలుగా పొందాడు. ఆయన ఎవరు?
- భారతం ప్రకారం వరుణుడి సభలో ఉండే నది పేరు?
- భారతాన్ని అనుసరించి, ఊర్వశి, పురూరవుల కొడుకు ఎవరు?
- విష్ణు పురాణాన్ని అనుసరించి విశ్వకర్మ ఒక విమానాన్ని సూర్యుడి ధూళితో చేసి బ్రహ్మకు ఇచ్చాడు. బ్రహ్మ కుబేరునికి ఇచ్చిన ఆ విమానం పేరు?
- రామాయణాన్ని అనుసరించి, బ్రహ్మదేవుని కుమారుడైన కుశుడు అనే మహర్షికి ఉన్న నలుగురు కొడుకులలో ధర్మారణ్యాన్ని పాలించిన కొడుకు పేరు?
- దేవీ భాగవతాన్ని అనుసరించి, పురుకుత్సుడు, మునికుందుడు (అంబరీషుడు) లను కన్న మాంధాత భార్య, శశిబిందువు కూతురు పేరు?
- సుబ్రహ్మణ్యస్వామికి వ్యతిరేకంగా పోరాడిన రాక్షసుడు. ఇతడు ఆయన చేతిలో మరణించి, విశ్వకుడనే రాజుగా పుట్టినవాడి పేరు?
- మహానందికి శూద్రస్త్రీ వలన పుట్టినవాడు. ఇతనితో క్షత్రియ వంశం అంతరించింది. ఇతడి కొడుకు సుమాల్యుడు. నందులు వీరి తర్వాత రాజులయ్యారు. అతని పేరు?
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 జూన్ 17 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక-12 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2025 జూన్ 22 తేదీన వెలువడతాయి.
జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
పురాణ విజ్ఞాన ప్రహేళిక 10 జవాబులు:
1) హిరణ్య సరస్సు 2) వమ్రి 3) పింగళుడు 4) దృహి 5) చంద్రగుప్తుడు 6) కౌసల్య 7) కీర్తిసేనుడు 8) నగ్నజిత్తు 9) బేతాళుడు 10) ప్రియవర్చస్సు
పురాణ విజ్ఞాన ప్రహేళిక 10 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్
- పి.వి.రాజు, హైదరాబాదు
- రామలింగయ్య టి, తెనాలి
- శ్రేయ ఎస్. క్షీరసాగర్, దావణగెరె, కర్నాటక
వీరికి అభినందనలు.
గమనిక:
- పురాణ విజ్ఞాన ప్రహేళికలో ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణిస్తాము.
- ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
- క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.