[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]
భారతీయ పురాణాలు విజ్ఞాన గనులు. చదువుతున్న కొద్దీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. పురాణేతిహాసాల గాథలన్నీ పెద్దల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, పండితుల ద్వారా, ప్రవచనకర్తల ద్వారా మనలో చాలామందిమి వినే ఉంటాము. మనలో కొందరు రామాయణ, భారత భాగవతాది గ్రంథాలను నిత్య పారాయణం చేస్తూనే ఉంటారు. వీటిలోని విశేషాలను మరల మరల మననం చేసుకున్నా వాటి ఆస్వాదనా గుణం తగ్గుముఖం పట్టదు.
అందుకే, భారతీయ పురాణాలు, ఇతిహాసాలపై పాఠకులకున్న అవగాహననీ, విజ్ఞానాన్ని మరోసారి వెలికితెచ్చేలా, సంచికలో, శ్రీనివాసరావు సొంసాళె గారు ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్ నిర్వహిస్తున్నారు. ఇది వారం వారం కొనసాగుతుంది.
~
ప్రశ్నలు:
- అగస్తుడి సోదరుడు. అరణ్యవాసం చేస్తున్న రామలక్ష్మణులు ఇతడి ఆశ్రమాన్ని దర్శిస్తారు. పురాణ నామచంద్రిక ప్రకారం రామాయణంలో అతడి పేరు?
- రుక్మిణి దేవి తనను వివాహం చేసుకొనమని శ్రీకృష్ణునికి ఇతని ద్వారానే వర్తమానం పంపింది. ఆ బ్రాహ్మణుడి పేరు?
- భారతం ప్రకారం ఘటోత్కచుడి కొడుకు, అశ్వత్థామ చేతిలో మరణించిన వాడి పేరు?
- కథా సరిత్సాగరం ప్రకారం కైలాసంలో ఉన్న శివుడి తోట పేరు?
- దేవీభాగవతాన్ని అనుసరించి రాక్షస గురువైన శుక్రుడి తల్లి, విష్ణువును, ఇంద్రుడినీ శక్తిహీనులుగా చేయగలిగిన శక్తిమంతురాలి పేరు?
- భారతం ప్రకారం, ప్రతిశ్రవసుడి తల్లి అయిన భీముని భార్య పేరు?
- భారతం ప్రకారం, బాణాసురుడి మంత్రి కుంభాండుడి కూతురు. ఉష చెలికత్తె. ఈమె ఆకాశమార్గాన వెళ్ళి అనిరుద్ధుని తీసుకుని వచ్చి ఉష అంతఃపురంలో పెట్టిన ఆమె పేరు?
- కంబ రామాయణం ప్రకారం, క్షీరసాగర మథనం సమయంలో బైటకు వచ్చిన విలువైన వస్తువుల్లో కోరిన కోరికలని తీర్చే దేవమణి పేరు?
- వాల్మీకి రామాయణం ప్రకారం, గంగానదిలో పడిన శివుని రేతస్సు సుబ్రహ్మణ్యస్వామికి జన్మనిచ్చింది. సుబ్రహ్మణ్యస్వామితో బాటు గంగానదీ నుండి బంగారం, వెండి కూడా వచ్చింది. పేరు?
- కంబ రామాయణం ప్రకారం, సముద్ర లంఘన సమయంలో హనుమంతున్ని బాధించిన రాక్షసి, అతని చేతిలో మరణించిన ఆమె పేరు?
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 జూన్ 08 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక-11 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2025 జూన్ 15 తేదీన వెలువడతాయి.
జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
పురాణ విజ్ఞాన ప్రహేళిక 9 జవాబులు:
1.సుమతి 2. సుమంత్రుడు 3. సుందరవల్లి 4. సుకుమారుడు 5. బల్లేశ్వరుడు 6. గవాక్షుడు 7. అధోముఖ/అధశ్శిరస్సు 8. పురోచనుడు 9. దేవవతి 10. మంజువంతం/మానసరోవరం
పురాణ విజ్ఞాన ప్రహేళిక 9 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్
- పి.వి.రాజు, హైదరాబాదు
- రామలింగయ్య టి, తెనాలి
- పెయ్యేటి సీతామహాలక్ష్మి
- పి.వి.ఎన్. కృష్ణ శర్మ
- పెయ్యేటి జానకీ సుభద్ర
- శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీ విద్య మనస్విని సోమయాజుల
- పి. రాజదుర్గ
- పి. వి. ఎస్. జగన్నాథరావు
- కె. సుమతి
- బి. అన్నపూర్ణ
- కె. వెంకటేశు
- కె. ఆంజనేయులు
- ఎస్. లక్ష్మి
వీరికి అభినందనలు.
గమనిక:
- పురాణ విజ్ఞాన ప్రహేళికలో ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణిస్తాము.
- ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
- క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.