Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పురాణ విజ్ఞాన ప్రహేళిక-10

[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]

భారతీయ పురాణాలు విజ్ఞాన గనులు. చదువుతున్న కొద్దీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. పురాణేతిహాసాల గాథలన్నీ పెద్దల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, పండితుల ద్వారా, ప్రవచనకర్తల ద్వారా మనలో చాలామందిమి వినే ఉంటాము. మనలో కొందరు రామాయణ, భారత భాగవతాది గ్రంథాలను నిత్య పారాయణం చేస్తూనే ఉంటారు. వీటిలోని విశేషాలను మరల మరల మననం చేసుకున్నా వాటి ఆస్వాదనా గుణం తగ్గుముఖం పట్టదు.

అందుకే, భారతీయ పురాణాలు, ఇతిహాసాలపై పాఠకులకున్న అవగాహననీ, విజ్ఞానాన్ని మరోసారి వెలికితెచ్చేలా, సంచికలో, శ్రీనివాసరావు సొంసాళె గారు ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్ నిర్వహిస్తున్నారు. ఇది వారం వారం కొనసాగుతుంది.

~

ప్రశ్నలు:

  1. చంద్రుడు తన పాపాలను పోగొట్టుకున్న ప్రాచీన తీర్థం ఏది?
  2. దేవీ భాగవతం ప్రకారం విష్ణువు ఎక్కుపెట్టిన ధనస్సుపై నిద్రిస్తుండే ఒక కీటకం, ఆ వింటి నారిని కొరకగా, ఆ దెబ్బతో విష్ణుమూర్తి తల ఊడిపోతుంది. ఆ కీటకం పేరు?
  3. గణేశ పురాణం ప్రకారం చెడుబుద్ధులున్న బ్రాహ్మణుడిని అతని భార్య చంపుతుంది. మరుజన్మలో అతడు గద్దగా, ఆమె చిలుకగా పుడతారు. గద్ద చిలుకను చంపుతుంది. గద్దను పులి తింటుంది. ఓ బ్రాహ్మణుడు చదువుతున్న భగవద్గీత వినడం వల్ల వీరికి పితృలోకం ప్రాప్తిస్తుంది. ఆ బ్రాహ్మణుడి పేరు?
  4. భారతం ప్రకారం శర్మిష్ట, యయాతిల కొడుకు, యయాతి ముసలితనాన్ని స్వీకరించడానికి నిరాకరిస్తే, యయాతి కోపించి, ఇతని వంశం వారికి రాజ్యార్హత లేకుండేట్టు, ముసలితనం రాకుండానే మరణించేట్లు శపిస్తాడు. ఆ కొడుకు పేరు?
  5. కంబ రామాయణం ప్రకారం రావణుడి రెండో కొడుకు, సుగ్రీవుడి కూతురిని, విభీషణుడి కోడల్ని అపహరించిన వాడి పేరు?
  6. భారతాన్ని అనుసరించి, కాశీరాజు భార్యకు అంబ, అంబిక, అంబాలిక అనే ముగ్గురు కూతుర్లు ఉన్నారు. అంబాలికకు ఉన్న మరో పేరు ఏమిటి?
  7. కథాసరిత్సాగరం ప్రకారం, వాసుకి సోదరుడు, శ్రుతార్థ అనే బ్రాహ్మణ స్త్రీని ప్రేమించి పెళ్ళి చేసుకున్నది ఎవరు?
  8. భాగవతం ప్రకారం కోసల దేశపు రాజకుమార్తె నాగ్నజితిని శ్రీకృష్ణుడు, అతని రాజ్యంలో అజేయులుగా ఉన్న వాడికొమ్ములున్న ఏడు ఎద్దులను ఓడించి, నాగ్నజితిని వివాహం చేసుకుంటాడు. ఈమె తండ్రి ఎవరు?
  9. దేవీ భాగవతం పకారం యుగంధర దేశపు రాజు శివభక్తుడు. శివుడు పార్వతికి రహస్యంగా చెప్పిన కథను విని దాన్ని తన భార్య దేవదత్తకు చెప్పగా, శివుడు ఇతన్ని శపించగా, రాజు పుష్పదంతుడు ఎవరిగా మారుతాడు?
  10. స్కాందపురాణం ప్రకారం కుబేరుని సభలోని అప్సరస, శాపం వల్ల మొసలిగా పడి వుండి, అర్జునుడు వల్ల శాప విమోచనం పొందినది ఎవరు?

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 జూన్ 03 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక-10 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2025 జూన్ 08 తేదీన వెలువడతాయి.

జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

పురాణ విజ్ఞాన ప్రహేళిక 8 జవాబులు:

1) శుష్కుడు 2) శైలూషుడు 3) శౌష్కలుడు 4) సంవరుణుడు 5) సహస్రముఖుడు/సహస్రకంఠుడు 6) సహోఢ 7) సాంబుడు 8) సారస్వతుడు 9) సుగ్రీవి 10) సునీథం

పురాణ విజ్ఞాన ప్రహేళిక 8 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. పురాణ విజ్ఞాన ప్రహేళికలో ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణిస్తాము.
  2. ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  3. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version