[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్ని పాఠకులకు అందిస్తున్నాము.]
భారతీయ పురాణాలు విజ్ఞాన గనులు. చదువుతున్న కొద్దీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. పురాణేతిహాసాల గాథలన్నీ పెద్దల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, పండితుల ద్వారా, ప్రవచనకర్తల ద్వారా మనలో చాలామందిమి వినే ఉంటాము. మనలో కొందరు రామాయణ, భారత భాగవతాది గ్రంథాలను నిత్య పారాయణం చేస్తూనే ఉంటారు. వీటిలోని విశేషాలను మరల మరల మననం చేసుకున్నా వాటి ఆస్వాదనా గుణం తగ్గుముఖం పట్టదు.
అందుకే, భారతీయ పురాణాలు, ఇతిహాసాలపై పాఠకులకున్న అవగాహననీ, విజ్ఞానాన్ని మరోసారి వెలికితెచ్చేలా, సంచికలో, శ్రీనివాసరావు సొంసాళె గారు ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్ నిర్వహిస్తున్నారు. ఇది వారం వారం కొనసాగుతుంది.
~
ప్రశ్నలు:
- ‘రామాయణం’ ప్రకారం. రామలక్ష్మణులు సీతను వెదుక్కుంటూ మాతంగ ముని ఆశ్రమానికి వెళ్తున్నప్పుడు, శూర్పణఖకు లాగా, లక్ష్మణుడు ఏ రాక్షసి ముక్కు, చెవులు కోసి పంపిస్తాడు? (క్లూ: అరణ్యకాండ, సర్గ 69)
- భారతాన్ని అనుసరించి, కౌరవుల పక్షాన యుద్ధం చేసిన వాడు, అర్జునుని కుమారుడైన ఇరావంతున్ని చంపినవాడు, తుదకు ఘటోత్కచుని చేతిలో మరణించిన వాడు ఎవరు?
- అగ్నిపురాణాన్ననుసరించి హేహయ వంశపు రాజు, జరాసంధుని తాత గారి పేరేమిటి?
- మత్స్యపురాణం ప్రకారం, బ్రహ్మ మనస్సు నుండి సగం స్త్రీ రూపంగా, సగం పురుష రూపంగా పుట్టిన శక్తి పేరేమిటి?
- భారతాన్ననుసరించి, కౌరవులు చెక్క బంతిలో ఆడుకుంటంటే, అది బావిలో పడగా, అక్కడికొచ్చిన ద్రోణాచార్యులవారు తన బాణాలతో పైకి తీసిన ఆ చెక్క బంతి పేరేమిటి?
- భారతం ప్రకారం శ్రీ కృష్ణుని రథాన్ని లాగే మూడవ గుఱ్ఱం ఏది?
- విక్రమార్క చరిత్ర ప్రకారం, చంద్రగుప్తుడు, రాగమంజరిల కుమారుడి పేరేమిటి?
- కంబ రామాయణం ప్రకారం శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు అగస్త్యముని వారుండే అరణ్యం ఏది?
- ‘మృచ్ఛకటికం’ ప్రకారం చారుదత్తుడనే బ్రాహ్మణున్ని ప్రేమించిన వారకాంత ఎవరు?
- భారతాన్ననుసరించి, బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి అని పిలువబడే వారి నేమందురు?
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 ఏప్రిల్ 01 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక-1 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2025 ఏప్రిల్ 06 తేదీన వెలువడతాయి.
జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
గమనిక:
- పురాణ విజ్ఞాన ప్రహేళికలో ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణిస్తాము.
- ఈ క్విజ్కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
- క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.