నీవు మౌనమై
మూగపోయావు
నేను బాధతో
క్రుంగిపోతున్నా
నీవు అప్పుడప్పుడు సందెవేళ
తారలా తళుకుమంటుంటే
నేను ప్రేమతో
నా భావాలు చిలకరిస్తున్నా
కారణం
నేను ఓ ఒంటరి
ప్రేమికుడిని
నాకు స్నేహం అంటూ ఉంటే
నీవు మాత్రమే
నా తలపులకు
జీవం ఉన్నదంటే నీవే కారణం
నను గుర్తించే
హృదయం ఉందో లేదో తెలీదు
నన్ను వరించే
మనసు భువిపై ఉన్నదో లేదో తెలియదు
నాకు తెలిసిన నిన్ను
ప్రేమిస్తూనే ఉంటా
ప్రణయంతో ఆరాధిస్తునే ఉంటా
ప్రియమైన.. ప్రేయసి
డా. బాలాజీ దీక్షితులు పి.వి. హోమియోపతి వైద్యునిగా, కవిగా, గెస్ట్ లెక్చరర్‌గా, వ్యక్తిత్వ వికాస నిపుణినిగా, కౌన్సిలింగ్ సైకాలజీస్ట్గా ఇలా ఎన్నో రంగాలలో విశిష్టత చాటుకున్నారు. డా. దీక్షితులు ఇప్పటి వరకు 58 జాతీయ,అంతర జాతీయ పరిశోధనా పత్రాలు ప్రచురించారు. ఇప్పటికి 10 పరిశోధనా సమావేశాలలో పాల్గొన్నారు, దాదాపు 90 తెలుగు రచనలు వివిధ పత్రికలలో ప్రచురితం అయినాయి. వీరి సేవ మరియు ప్రతిభను గుర్తించి యూనివర్సిటీ అఫ్ సోత్ అమెరికా డాక్టరేట్ 2016లో ఇచ్చింది. ఇవిగాక అనేక అవార్డ్స్, రివార్డ్స్ అనేక సంస్థలు అందించాయి.