ప్రముఖ రచయిత శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘ప్రేమేగా ప్రపంచం’ అనే నవలని ధారావాహికంగా పాఠకులకు అందించబోతున్నాము.
***
మనం ఉన్న ఈ భూతలం అంతా ఆ సర్వేశ్వరుల ప్రేమ భరితం. ఆ ప్రేమ అనే పదానికి కులం లేదు, మతం లేదు. అది ఒక సర్వేశ్వర నిర్దేశికమైన మహాశక్తి.
ఈ సృష్టిలో అన్ని ధర్మాల కన్నా మిన్నా స్నేహధర్మం. కారణాంతరాల వలన చెడిపోయిన వారిని, స్వజనం, బందువులు, అయినవారు నిరాదరణ చేస్తారేమో! కానీ, మంచి మిత్రుడు, స్నేహితుడు, తన చెడిపోయిన మిత్రుడిని గురించి బాధపడతాడు, వాడిని ఓదారుస్తాడు. ఊరట కలిగిస్తాడు. తను చేయగలిగిన సహాయం చేసి, మిత్రుడిని పూర్వంలా నిలబడేటట్లు చేస్తాడు.
ఈ స్నేహ పూర్వక ప్రేమతత్వం మీద ఆధారపడే ఈనాటి ప్రపంచం ముందుకు సాగుతోంది.
ముగ్గురు మిత్రుల జీవిత గమనంలోని ఒడిదుడుకులు వలన ఎదుర్కొన్న సమస్యలు, ఆ స్థితుల నుండి వారు ఏ రీతిగా సమస్యారహితమైనారూ.. వారి మధ్యన వున్న అపారమైన ప్రేమాభిమానాలకు ప్రత్యక్ష సాక్షి.. ఈ నవల ‘ప్రేమేగా ప్రపంచం’.
***
వచ్చే వారం నుంచే.. చదవండి. చదివించండి.
‘ప్రేమేగా ప్రపంచం’.