Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రేమ తపస్సు

[శ్రీ కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రచించిన ‘ప్రేమ తపస్సు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

ప్రియా..!
ఆకాశంలో తారలా
నీవు మెరుస్తూనే ఉంటావ్
పున్నమి నాటి వెన్నెలలా
నీవు చల్లగా ఉంటావ్
వీచే పిల్ల తెమ్మెరలా
నీవు హాయిగా ఉంటావ్
గలగల పారే సెలయేరులా
నీవు స్వచ్ఛంగా ఉంటావ్
గెంతులు వేసే లేడిపిల్లలా
నీవు హుషారుగా ఉంటావ్
గాలిలో ఎగిరే విహంగంలా
నీవు స్వేచ్ఛగా ఉంటావ్
అంతకు మించి..
నీకై తపస్సు చేస్తున్న నా గుండెలో
నీవు ఎప్పుడు కొలువై ఉంటావ్..!

Exit mobile version