[శ్రీ కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రచించిన ‘ప్రేమ దీపం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ప్రియతమా..!
శంఖం లాంటి నీ మెడలో
ముత్యాల హారమై మెరవనా
ముత్యపు చిప్పలాంటి నీ చెవిపై
పసిడి లోలాకునై మురవనా
మల్లెతీగలాంటి నీ నడుముపై
వెండి వడ్డాణమై ఒదగనా
మొగలి రేకులాంటి నీ నాశికపై
వజ్రపు పుడకనై వెలగనా
అనురాగాల అర్చన చేయనా
ఆప్యాయతల అభిషేకం జరపనా
నీ గుండెలో గుడి కట్టి
నిత్యం దీపాన్నై హారతివ్వనా..!